hyderabadupdates.com Gallery బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం post thumbnail image

చిత్తూరు జిల్లా : దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. భ‌క్తుల‌తో అల‌రారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యం. ఈనెల‌లో శివ రాత్రి ప‌ర్వ‌దినం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆల‌య క‌మిటీ. ఇదిలా ఉండ‌గా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజ‌రు కావాల‌ని కోరుతూ రాష్ట్ర‌ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ను క‌లిశారు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్. ఈ సంద‌ర్భంగా పూజారులు ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు. అనంత‌రం సాయి ప్ర‌సాద్ దేవాల‌య క‌మిటీ త‌ర‌పున ప‌వ‌న్ కు ఆహ్వాన ప‌త్రిక‌ను ఇచ్చారు.
శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ఎత్తున‌ బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు ఆల‌య క‌మిటీ చైర్మ‌న్. ఈ కార్య‌క్ర‌మానికి మీరు త‌ప్ప‌కుండా రావాల‌ని కోరారు. మీరు గెలవాల‌ని ప్రార్థ‌న‌లు కూడా చేశామ‌న్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.
The post బ్ర‌హ్మోత్స‌వాల‌కు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌Al Falah University: ఢిల్లీ పేలుడు ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు అరెస్ట్‌

    ఎర్రకోట సమీపంలోని జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు హరియాణాలోని ఆల్‌ ఫలాహ్‌ యూనివర్శిటీకి చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్‌ అయిన ముగ్గురు డాక్టర్లలో డాక్టర్

లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!లెనిన్‌ లాస్ట్‌ షెడ్యూల్‌!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మొత్తం టాకీ పార్ట్‌లో 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన

కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!కె-ర్యాంప్‌ టార్గెట్‌ ఎంతో..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కె-ర్యాంప్’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోలు, ఫోటోలు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి టైమ్‌లో అనేక సినిమాలతో పోటీగా విడుదల కావడం ఈ