hyderabadupdates.com Gallery భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు

భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు

భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు post thumbnail image

హైద‌రాబాద్ : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడ‌ని, ఇప్పుడు వాటి ఊసెత్త‌డం లేద‌న్నారు. ఇప్పుడు ఆ కార్డు ఎక్కడ పెట్టుకోవాలో ప్రజలకు అర్థం అవ్వడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి సంచులు మోసుడు, పదవులు కాపాడుకునుడు తప్ప కాంగ్రెస్ వాళ్లకి ఏమీ చేత‌కాద‌న్నారు. సింగ‌రేణి టెండ‌ర్ల స్కాంపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించిన తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కేటీఆర్. ఈ స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి సీబీఐ విచారణ కోరితేనే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది కేవలం కేంద్ర మంత్రి అజ్ఞానమా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందాల ఫలితమా అన్న కేటీఆర్
తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట పడినా, కేంద్ర మంత్రిగా మీరు చర్యలు తీసుకోక పోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్లు కట్టబెట్టిన ముఖ్యమంత్రి తానే సీబీఐ దర్యాప్తున‌కు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ కాదా అని నిలదీశారు. పట్టపగలు దోపిడీ చేసిన దొంగ ఎక్కడైనా స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనపైనే విచారణ జరపాలని కోరతాడా? అని నిల‌దీశారు. సింగరేణి స్కామ్‌లో ఇదే తరహా విచిత్రమైన వాదనను కేంద్ర మంత్రి చేయడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సైట్ విజిట్ నిబంధనను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తీసుకొచ్చింది తన బావమరిదికి టెండర్లు అప్పనంగా అప్ప జెప్పేందుకేనని తెలిసినా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఇంకా దాగుడు మూతలు ఆడటానికి కారణం ఏమిటో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
The post భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషిఏపీలో ప‌ర్యాట‌క అభివృద్దికి స‌ర్కార్ కృషి

అమ‌రావ‌తి : రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బాపట్ల జిల్లా ఇంచార్జి మంత్రి, గృహ నిర్మాణ సంస్థ , సమాచార శాఖా మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు. చీరాల మండలం, అక్కయిపాలెం గ్రామపంచాయతీ, రామాపురం, పాండురంగా

AP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటుAP Government: విశాఖ ఆర్డీవో, డీఆర్వోపై బదిలీ వేటు

  విభేదాలతో రోడ్డెక్కిన విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ, డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి) బీహెచ్‌ భవానీ శంకర్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవో, డీఆర్వోల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల తీవ్రంగా మారాయి. తహసీల్దార్‌

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్

నేపాల్ : నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చెల‌రేగిన త‌రుణంలో నేపాల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ త‌రుణంలో దేశ ప్ర‌ధాన‌మంత్రిగా అతి పిన్న వ‌య‌సు క‌లిగిన బాలేంద్ర షా బాలెన్ కొలువు తీరారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 35 ఏళ్లు మాత్ర‌మే. ఆయ‌న‌పై