hyderabadupdates.com Gallery భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి post thumbnail image

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ మేర‌కు అనుమతి ఇచ్చేది లేదంటూ ఆయా దేశాల అధ్య‌క్షుడు యూనుస్, షెహ‌బాజ్ ష‌రీలు ప్ర‌క‌టించారు. దీంతో ఐసీసీ సీరియ‌స్ అయ్యింది. చివ‌ర‌కు ఆ రెండు టీమ్ ల‌ను నిషేధించే ఆలోచ‌న‌లో ఉంది. ఈ త‌రుణంలో శ్రీ‌లంక క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీమిండియాతో ఆడే విష‌యంలో పాకిస్తాన్ పున‌రాలోచించాల‌ని ఈ సంద‌ర్బంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ను కోరింది. పునః ప‌రిశీలించాల‌ని సూచించింది.
శ్రీలంక క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్‌ను నిర్వహించడానికి ఆసక్తిగా ఉందని స్ప‌ష్టం చేసింది. శ్రీలంకలో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన అన్ని వాణిజ్య, కార్యాచరణ, లాజిస్టికల్ , భద్రతా సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఆతిథ్య ఏర్పాట్లు, టిక్కెట్ల అమ్మకాలు కూడా పూర్తయ్యాయని ధృవీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనున్న భారత్ vs పాకిస్తాన్ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ ను బ‌హిష్క‌రించాల‌ని పీసీబీ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేసింది శ్రీ‌లంక క్రికెట్ బోర్డు. ఈ చ‌ర్య వ‌ల్ల భారీ ఎత్తున వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భారీ న‌ష్టం వ‌స్తుంద‌ని పేర్కొంది. ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా తాము ఏర్పాట్లు చేశామ‌ని తెలిపింది.
The post భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్నెట్ ఫ్లిక్స్ లో బాల‌య్య అఖండ స్ట్రీమింగ్

హైద‌రాబాద్ : డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అఖండ మూవీ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టికే బాల‌య్య సినీ కెరీర్ లో రూ. 130 కోట్లు వ‌సూలు చేసింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ సాధించే ఛాన్స్ ఉంద‌ని సినీ

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమలSabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

    కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన

నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు స్థ‌లం కేటాయిస్తాంనెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు స్థ‌లం కేటాయిస్తాం

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ మరింత విస్తరణకు భారత్ ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్ల‌డించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న