hyderabadupdates.com Gallery మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్ post thumbnail image

హైదరాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు ఉన్న‌ట్టుండి కొత్త ఏడాది క‌లిసి వచ్చింది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసి ఓడి పోయారు. ఇక్క‌డ ఎమ్మెల్యే గా ఉన్న గాంధీ అనారోగ్యంతో మృతి చెంద‌డంతో మ‌రోసారి ఇక్క‌డి నుంచే పోటీ చేసేందుకు ట్రై చేశారు. చివ‌ర‌కు ఏమైందో ఏమో కానీ హైక‌మాండ్ త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చింది. అంతే కాదు ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న‌ను మ‌లివిడ‌త కేబినెట్ లోకి మంత్రిగా తీసుకుంది. కీల‌క‌మైన శాఖ‌ల‌ను అప్ప‌గించింది అజారుద్దీన్ కు .ప్ర‌ధానంగా అత్య‌ధికంగా జ‌నాభా క‌లిగిన మైనార్టీల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే ప్ర‌ధాన డిమాండ్ అంత‌టా పెరిగింది.
ఈ త‌రుణంలో అనూహ్యంగా రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్సీగా ఉన్న క‌ల్వ‌కుంట్ల క‌విత ఇంట్లో విభేదాల కార‌ణంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారితో తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాను తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలిగా ఉన్నారు. జ‌నం బాట పేరుతో జ‌నంలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. చివ‌ర‌కు తాను బీఆర్ఎస్ నుంచి వ‌దిలేసి రావ‌డంతో ఇక ఆ పార్టీ నుంచి వ‌చ్చిన ప‌ద‌వి త‌న‌కు అక్క‌ర్లేద‌ని భావించారు. ఈమేర‌కు శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి తాను రాజీనామా చేసిన లేఖ‌ను స‌మ‌ర్పించింది. చివ‌ర‌కు త‌ను తాత్సారం చేయ‌డంతో తిరిగి త‌న రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరింది. ఆయ‌న ఓకే చెప్ప‌డంతో త్వ‌ర‌లోనే ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో అజ్జూకి లైన్ క్లియ‌ర్ అయ్యింది.
The post మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీనంద‌మూరి బాల‌య్య‌తో కొర‌టాల శివ మూవీ

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందుతున్న ద‌ర్శ‌కుల‌లో కొర‌టాల శివ ఒక‌రు. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్, జాహ్న‌వి క‌పూర్ తో తీసిన మూవీ దుమ్ము రేపింది. బిగ్ స‌క్సెస్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో తాజాగా కీల‌క

వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!వెంకీ మామ కోసం టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తో..!

టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమైన విక్టరీ వెంకటేష్ ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా హిట్ తర్వాత వెంకీ మామ ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త

మార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీమార్చి 1న తమిళనాడుకు ప్రధాని మోదీ

త‌మిళ‌నాడు : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ త‌మిళ‌నాడులో ప‌ర్యటించ‌నున్నారు. మార్చి 1వ తేదీన అధికారికంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధాని ఫిబ్ర‌వ‌రి 28వ తేదీన రాత్రికి చెన్నైకి చేరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన