hyderabadupdates.com movies రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు తెలుగు వాళ్లకు ఉండే సంబంధం మాటల్లో చెప్పలేనిది. గోంగూరతో చేసే వంటకాలు చాలానే ఉన్నాయి. వాటిలో గోంగూర పచ్చడి ఒకటి. అది ఇప్పుడు రష్యా అధ్యక్షుడికి రుచి చూపించారు.

భారత దేశ పర్యటనలో భాగంగా రెండు రోజుల కిందట ఇక్కడకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన గౌరవార్ధం నిన్నటి రోజున రాష్ట్రపతి విందును ఏర్పాటు చేశారు. అందులో పసందైన వంటకాలను వడ్డించారు. ఉత్తర, దక్షిణ భారత దేశాల మేళవింపుగా ఈ విందు కొనసాగింది.

అందులో మన తెలుగు వంటకం అయిన గోంగూర పచ్చడి ఉంది. నోరూరించే గోంగూరతో తయారు చేసిన పికిల్ ను ఆయనకు వడ్డించారు. దానితో పాటు ఆవకాయ పచ్చడిని కూడా టేబుల్ పై ఉంచారట. తెలుగు వంటకాలను ఆయనకు రుచి చూపించేందుకు ఏర్పాటు చేశారు మరి. ఇందులో దక్షిణ భారత దేశానికి చెందిన స్కాక్ ఐటమ్ మురుకు కూడా ఉంది. 

రష్యా అధ్యక్షుడికి ఆతిథ్యం అంటే మామూలుగా ఉండదు కదా..! ఆయనకు ఏర్పాటు చేసిన మెనూనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విందులో కాశ్మీరీ పుట్టగొడుగుల చట్నీ, పసుపు దాల్, బెంగాలీ స్వీట్.. ఇలా నోరూరించే వంటకాలు ఉన్నాయి. కుంకుమపువ్వుతో చేసిన పానీయం, హాక్‌ కా సాగ్‌, గులాటీ కబాబ్‌, ముర్గ్‌ ధనివాల్‌ కుర్మా, బాదాం షోర్బా, గులాబ్‌ ఖీర్‌, చీజ్‌ కేక్‌ వంటివి కూడా ఆయన మెనూలో ఉన్నాయి. అయితే పుతిన్ మితాహారి అని చెబుతున్నారు. ఆయన ఏం రుచి చూసినా.. తనకు ఇచ్చిన ఆతిథ్యానికి మాత్రం కృతజ్ఞతలు తెలిపారు.

Related Post

‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?‘ఉస్తాద్‌’లో ఐటెం సాంగ్ ఎందుకు లేదు?

స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్‌గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్

హీరో రెండో భార్యను మొదటి భార్య పొగిడితే..హీరో రెండో భార్యను మొదటి భార్య పొగిడితే..

ఒక వ్యక్తికి విడాకులై రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్య, రెండో భార్య మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం అన్నది దాదాపు అసాధ్యం అనదగ్గ విషయం. ఫిలిం సెలబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఐతే తమిళ సీనియర్ హీరో శరత్

NBK111: Nayanthara no longer a part of Nandamuri Balakrishna film? Here’s what we knowNBK111: Nayanthara no longer a part of Nandamuri Balakrishna film? Here’s what we know

The upcoming film NBK111, starring Nandamuri Balakrishna in the lead role, is undergoing major changes, both creatively and in casting. According to reports, after reworking the original storyline, the makers