hyderabadupdates.com Gallery రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు post thumbnail image

రాజ‌స్తాన్ : ఐపీఎల్ 2026లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు కెప్టెన్ రియాన్ ప‌రాగ్ దుందుడుకు స్వ‌భావం కార‌ణంగా ప‌లు చిక్కులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా త‌ను సంచ‌ల‌నంగా మారాడు. ఇందుకు కార‌ణం ముల్లాన్ పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ తో మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో రియాన్ ప‌రాగ్ ఈ-సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష ప్రసార టీవీలో స్పష్టంగా కనిపించిన ఈ చర్య, భారత చట్టాలను, స్టేడియం నిబంధనలను ఉల్లంఘించేదిగా ఉంద. దీనివల్ల ప‌రాగ్ కు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
కాగా రియాన్ ప‌రాగ్ నిర్వాకంపై సీరియ‌స్ గా స్పందించింది బీసీసీఐ. స‌ద‌రు క్రికెట‌ర్ నుండి వివ‌ర‌ణ కోరామ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ రూల్స్ ప్ర‌కారం మొద‌టిసారి చేసిన నేరానికి రియాన్ ప‌రాగ్ కు ఒక సంవ‌త్స‌రం జైలు శిక్ష లేదా రూ. ల‌క్ష జ‌రిమానా ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. భారత చట్టాల ప్రకారం ‘వేపింగ్’ చేయడం చట్టవిరుద్ధం. దీంతో త‌న‌కు శిక్ష త‌ప్ప‌ద‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది ఆటగాళ్లు e-సిగరెట్లు వాడుతుంటారు, కానీ వారు వాటిని డ్రెస్సింగ్ రూమ్‌లో తాగరు. చుట్టూ ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు అలా చేయడం చాలా ప్రమాదకరం. ప‌రాగ్ బ‌హిరంగంగా చేశాడు. త‌న‌కు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డ‌టం ఖాయం అంటున్నారు మాజీ క్రికెట‌ర్లు.
The post రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ రియాన్ ప‌రాగ్ పై వేటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Coromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దతCoromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దత

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాంప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం

అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.30

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది.