hyderabadupdates.com Gallery రికెల్ట‌న్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి

రికెల్ట‌న్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి

రికెల్ట‌న్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి post thumbnail image

ముంబై : ఈసారి ఐపీఎల్ 2026 సీజ‌న్ అంత‌గా క‌లిసి రాన‌ట్టుంది ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు. భారీ స్కోర్ చేసినా దానిని అవ‌లీల‌గా ఛేదించింది స‌న్ రైజ‌ర్స్ టీం. తాజాగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన పోరులో ఇరు జ‌ట్లు పోటా పోటీగా భారీ స్కోర్ లు న‌మోదు చేశాయి. టాస్ గెలిచిన క‌మిన్స్ ముందుగా ఫీల్డిండ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ముంబై ఇండియ‌న్స్ 244 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 18.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేసింది. కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోవ‌డం విశేషం. ఇక ఎస్ఆర్ హెచ్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది. స్వంత గ‌డ్డ‌పైనే కాదు ప్ర‌త్య‌ర్థికి చెందిన మైదానంలో కూడా స‌త్తా చాటుతోంది.
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 244 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. ప‌వ‌ర్ ప్లే లోనే ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు. ట్రావిస్ హెడ్ 30 బంతులు ఆడి 76 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. ఇక హెన్రిచ్ క్లాసెన్ 30 బాల్స్ ఫేస్ చేసి 65 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌ను 7 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. అభిషేక్ శ‌ర్మ 24 బంతులు ఆడి 45 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. స‌లీల్ అరోరా 10 బంతులు ఆడి 30 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి.
అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో రియాన్ రికెల్ట‌న్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 55 బంతులు ఆడి 123 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 10 ఫోర్లు 8 సిక్సులు ఉన్నాయి. విల్ జాక్స్ 22 బంతుల్లో 46 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర‌ర్లు 3 సిక్సులు ఉన్నాయి. ఇక కెప్టెన్ పాండ్యా 15 బంతులు ఆడి 31 ర‌న్స్ చేశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్ రైజ‌ర్స్ కు ఇది ఆరో విజ‌యం కాగా ముంబైకి ఇది వ‌రుస‌గా ఆరో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.
The post రికెల్ట‌న్ సెంచ‌రీ చేసినా ముంబైకి త‌ప్ప‌ని ఓట‌మి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదున్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హిళా ఐఏఎస్ ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛాన‌ల్ తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ల్స్ ల‌లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌తఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త

అమ‌రావ‌తి : ఏపీలో వ‌డ‌గాల్పుల తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. రాష్ట్రంలో ఎండ, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈనెల 22న బుధ‌వారం 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,