hyderabadupdates.com Gallery రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్

రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్

రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా ప్ర‌భ‌ల తీర్థంను రాష్ట్ర పండుగగా నిర్వ‌హిస్తామ‌ని, ఈ మేర‌కు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపార‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కందుల దుర్గేష్. ఆయ‌న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పబ్లిసిటీ సెల్ నందు స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్విని తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనసీమ జగ్గన్నతోటలో ప్రతి సంవత్సరం కనుమ రోజున ఘనంగా నిర్వహించే, 400 సంవత్సరాల ప్రాచీన సంప్రదాయ పండుగ ప్రభల తీర్థంను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు కేబినెట్ ఆమోదం లభించడం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు కందుల దుర్గేష్. ఇది కోనసీమ సంస్కృతికి, తెలుగువారి సంప్రదాయాలకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.
జాతీయ స్థాయిలో ఇప్పటికే గుర్తింపు పొందిన ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, స‌హ‌క‌రించిన స‌హ‌చ‌ర మంత్రుల‌క‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు కందుల దుర్గేష్. ఈ నిర్ణయం సంప్రదాయాల సంరక్షణకు, సాంస్కృతిక పర్యాటక అభివృద్ధికి, ప్రాంతీయ సమానత్వ సాధనకు దోహద పడుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కోనసీమ ప్రాంతంలోని 11 పురాతన శైవ ఆలయాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించబడే ఈ ప్రభల తీర్థానికి ప్రతి ఏటా సుమారు 6 లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారని చెప్పారు కందుల దుర్గేష్. ప్రభల ఊరేగింపు, కౌశికా నదిని దాటే విశిష్ట ఆచారం ఈ పండుగను రాష్ట్రానికి చెందిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వంగా నిలబెడుతున్నాయని తెలిపారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు, కేంద్ర పర్యాటక శాఖ గుర్తింపు ఈ పండుగ ప్రత్యేకతకు నిదర్శనం. రాష్ట్ర పండుగ హోదాతో ప్రభల తీర్థాన్ని భవిష్యత్ తరాల కోసం మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసి, కోనసీమను అధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ముందు కెళ్తామని ప్ర‌క‌టించారు.
The post రాష్ట్ర పండుగ‌గా ‘ప్ర‌భ‌ల తీర్థం’ : కందుల దుర్గేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడుస్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు

అమరావతి : వ్య‌వ‌సాయం దండుగ కాద‌ని అది పండుగ అని అందుకే త‌మ స‌ర్కార్ ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా

హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌హిందీలో ‘సినిమా’ చేస్తున్న వేణు ఉడుగుల‌

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క‌, నిర్మాత వేణు ఉడుగుల బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. త‌ను ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆపై నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. అష్ట క‌ష్టాలు ప‌డి, అప్పులు చేసిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశాడు. తాజాగా

Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?Chirag Paswan: బిహార్‌ లో ఎన్డీయేకు తప్పని చిరాగ్ చికాకు ?

Chirag Paswan : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే