hyderabadupdates.com Gallery రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ

రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ

రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ post thumbnail image

న్యూఢిల్లీ : దేశ‌మంత‌టా నిత్యం వినియోగించే గ్యాస్ కు సంబంధించి ఆందోళ‌న‌లు నెల‌కొన్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి గుడ్ న్యూస్ చెప్పింది మోదీ స‌ర్కార్. వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని పేర్కొంది. గ్యాస్ సిలిండ‌ర్ కోసం బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అందిస్తామని వెల్లడించింది. LPG ఉత్పత్తిని 25 శాతానికి పెంచామని పేర్కొంది కేంద్రం. హార్ముజ్‌కు సంబంధం లేని రూట్ల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటున్నామని, త్వరలోనే భారత్‌కు రెండు LNG కార్గోలు రానున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి , LPG దిగుమతులపై ఉన్న ప్రతిష్టంభన కారణంగా, విస్తృత కవరేజీని నిర్ధారించడానికి అందుబాటులో ఉన్న సరఫరాలను జాగ్రత్తగా అంద‌జేస్తున్న‌ట్లు తెలిపింది. దేశీయ గృహాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందని స్ప‌ష్టం చేసింది కేంద్ర స‌ర్కార్. ఇతర అభ్యర్థనలను బీపీసీఎల్, ఐఓసీ, హెచ్ పీ సీఎల్ నుండి LPG ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల సంయుక్త కమిటీ సమీక్షిస్తోందని వెల్ల‌డించింది, క్లిష్టత ఆధారంగా కేటాయింపులను పరిశీలిస్తుంద‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. సాధారణ సరఫరా పరిస్థితులు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయనే ఆశతో LPG దిగుమతులను ఉచితంగా ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది.
ఇదిలా ఉండ‌గా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం పాక్షికంగా గ్యాస్ సరఫరా అంతరాయం ఎదుర్కొంటోంద. ప్రభుత్వం దేశీయ సీఎన్జీ, పీఎన్జీ వినియోగదారులకు ప్రాధాన్యత ఇస్తోంది. యుద్ధం కారణంగా భారతదేశ సహజ వాయువు సరఫరా పాక్షికంగా ప్రభావితమైంది, రోజుకు దాదాపు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు సరఫరా ప్రభావితమైందని ప్రభుత్వం ధృవీకరించింది.
The post రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్

హైద‌రాబాద్ : టిజీ విశ్వ ప్ర‌సాద్, కీర్తి ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మారుతి. అయితే ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత

ఆక్ర‌మ‌దారుణల నుంచి పార్కుల‌ను కాపాడండిఆక్ర‌మ‌దారుణల నుంచి పార్కుల‌ను కాపాడండి

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌దారుల నుండి ప్ర‌భుత్వ పార్కుల‌ను కాపాడాల‌ని హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం బ‌డంగిపేటను స‌ర్కిల్ ఆల్మాస్‌గూడ 57వ డివిజ‌న్ శ్రీ హిల్స్ కాల‌నీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్ల‌తో లే ఔట్ వేశారు. ఇందులో

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలిభ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : గోదావ‌రి పుష్క‌రాల‌ను క‌నీవిని ఎరుగ‌ని రీతిలో నిర్వహించాల‌ని అన్నారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. సెక్రటేరియట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్