hyderabadupdates.com Gallery రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ post thumbnail image

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. గత ప్రభత్వం నిర్వహించిన రీ సర్వే తప్పుల తడకగా ఉండటంతో కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరి చేస్తోందని తెలిపారు. గత ముఖ్యమంత్రి పొలం హద్దుల కోసం పాతే రాళ్లపైనా, రైతులకు ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై తన ఫోటోలను ముద్రించుకున్నారంటూ ఆరోపించారు. వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తైందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు సీఎం. దీంతో పాటు ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని పేర్కొన్నారు.
జనవరి నెలలో 4,783 గ్రామాల్లో 18.77 లక్షల పాస్ పుస్తకాలు, ఫిబ్రవరిలో 279 గ్రామాల్లో 1,16,129 పాస్ పుస్తకాలు, మార్చిలో 299 గ్రామాల్లో 1,29,298 పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం అందించిందని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. జనవరి నుంచి 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు ప్రభుత్వం అందించిందన్నారు. మార్చి 2027 నాటికి 7,518 సిగ్నల్ గ్రామాల్లో 47,02,000 పాస్ పుస్తకాలు ఇచ్చామ‌న్నారు. ఏప్రిల్ 2027 కల్లా 2,438 నాన్ సిగ్నల్ గ్రామాల్లోని 15,02,000 పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62,04,000 పాస్‌బుక్స్ కొత్తవి ఇవ్వాల్సి ఉందన్నారు. బాపట్ల జిల్లాలోని 8 మండలాల్లో 3,658 పాస్ పుస్తకాలు, అలాగే వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 1,795 పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
The post రైతులకు పట్టాదారు పుస్తకాలు పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్సంజు శాంస‌న్ వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ : గౌత‌మ్ గంభీర్

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం పై ఆస‌క్తక‌ర వ్యాఖ్య‌లు చేశాడు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. త‌ను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ గురించి ప్ర‌శంస‌లు

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే ఇంటికేవిద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే ఇంటికే

అమరావతి : సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులకు ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు.

భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడుభట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు

హైద‌రాబాద్ : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడ‌ని, ఇప్పుడు వాటి ఊసెత్త‌డం లేద‌న్నారు. ఇప్పుడు