hyderabadupdates.com movies వరం అడగకపోతేనే కింగుకు మంచిది

వరం అడగకపోతేనే కింగుకు మంచిది

ఎల్లుండి విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ కాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య టయర్ 2 హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్ల హైక్స్ అడగడం మాములు విషయమైపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రకింగ్ తాలూకాకు కూడా పెంపులు తెస్తారేమోననే అనుమానం ఫ్యాన్స్ లో లేకపోలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెగ్యులర్ ధరలతోనే టికెట్ రేట్లు ఉండొచ్చట. తెలంగాణలో ఎలాగూ గరిష్ట పరిమితి తగినంత ఉంది కాబట్టి అక్కడేం టెన్షన్ లేదు కానీ మిరాయ్ లాగా హిట్ టాక్ వస్తే ఏపీలోనూ లాభాలు చూడొచ్చు.

రామ్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం చాలా తిరుగుతున్నాడు. ఇక్కడి ఈవెంట్లన్నీ చూసుకుని యుఎస్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అక్కడి ఎన్ఆర్ఐలతో కలిసి ప్రీమియర్లు చూడబోతున్నాడు. రిలీజ్ టైంలో ఇక్కడ ఉండకుండా అమెరికాలో పబ్లిసిటీ ప్లాన్ చేసుకోవడం చూస్తే ఈసారి యుఎస్ మార్కెట్ గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. నాని, తేజ సజ్జ లాంటి వాళ్ళు ఈ స్ట్రాటజీతోనే వర్కౌట్ చేసుకున్నారు. అందుకే రామ్ కూడా అదే దారిలో వెళ్తున్నాడు కాబోలు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా రామ్ తో పాటు వెళ్లి ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకుంటోంది. ఓపెనింగ్స్ మీద అక్కడి బయ్యర్లు ధీమాగా ఉన్నారు.

ఈ మధ్య ట్రెండ్ గమనిస్తుంటే టికెట్ రేట్ల ప్రభావం ఆడియన్స్ మీద బలంగానే ఉంది. రాజు వెడ్స్ రాంబాయికి మొదటి రోజు 99 రూపాయలు పెట్టడం టాక్ పరంగా ఎంత పెద్ద మేలు చేసిందో చూశాం. ప్యాన్ ఇండియా బడ్జెట్ పెట్టినా సరే మిరాయ్ కు పెంపుకు వెళ్ళకపోవడం చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఆంధ్రకింగ్ తాలూకా ఇదే రూటులో వెళ్లడం ఖచ్చితంగా మేలు చేస్తుంది కాకపోతే నిజంగా పెంపుకు వెళ్లరా లేదానేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అసలే బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి లేదు. ఇప్పుడు కనక ఆంధ్రకింగ్ తాలూకా కనక బాగుందనే మాట తెచ్చుకుంటే అఖండ 2 వచ్చాక కూడా హోల్డ్ కొనసాగించవచ్చు.

Related Post

టీమిండియాకు అసలు గండం వాళ్లతోనేటీమిండియాకు అసలు గండం వాళ్లతోనే

వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గురించే హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్ లో లేదు, ‘సూపర్ 8’లో ఉంది. ఐసీసీ ఈసారి అమలు చేస్తున్న ‘ప్రీ డిసైడెడ్ సీడింగ్స్’ వల్ల ఇండియాకు ముందే

జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్జూబ్లీహిల్స్ ఫలితాలపై సీఎం రేవంత్ రియాక్షన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న ద‌రిమిలా సీఎం రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ విజ‌యాన్ని తాను ముందుగానే ఊహించాన‌ని చెప్పారు. “నేను ముందేచెప్పా.. బీఆర్ ఎస్ పార్టీ ఎప్ప‌టికీ గెల‌వ‌దు. ఏం చేశార‌ని