hyderabadupdates.com Gallery వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్

వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్ post thumbnail image

విజ‌య‌వాడ‌ : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల‌ను రీ స‌ర్వే చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అంతే కాకుండా స‌ర్వే చేసిన భూముల వివ‌రాల‌ను ఆన్ లైన్ లో న‌మోదు చేయాల‌ని కోరారు. రెవెన్యూ వ్యవస్థ‌ లో ప్రక్షాళన అవసరం ఉంద‌న్నారు. రెవెన్యూ సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. భూ రీ–సర్వే, LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ లింక్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి భూ యజమానులకు, రైతులకు న్యాయం చేయాల‌ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్ట‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు. రైతుల భూమి హక్కుల పరిరక్షణకు ఇది కీలకమైన కార్యక్రమం అని పేర్కొన్నారు పీవీఎన్ మాధ‌వ్. అయితే, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భూ రీ–సర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, హద్దులు–విస్తీర్ణంలో అవకతవకలు, LPM లో పొరపాట్లు, టైటిల్ డీడ్ , ఆధార్ లింక్ లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారయ్యాయని ఆంద‌ళ‌న వ్య‌క్తం చేశారు. గ‌త ప్ర‌భుత్వం వీఆర్ఓ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసింద‌ని, దాని స్థానంలో కొత్త‌గా ప్ర‌వేశ పెట్టిన స‌చివాల‌య గ్రామ వ్య‌వ‌స్థ కూడా అవినీతికి కేరాఫ్ గా మారింద‌న్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న చెందారు. అందుకే రాష్ట్రంలోని భూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌ర్కార్ ను కోరారు.
The post వ్య‌వ‌సాయ భూములు రీ స‌ర్వే చేయాలి : పీవీఎన్ మాధ‌వ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్కాంట్రాక్టుల కోస‌మే బీజేపీలో చేరిన సీఎం రమేష్

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఏకి పారేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం అమ‌రావ‌తిని రాజ‌ధాని చేస్తున్నారో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సీఎం రమేష్

ఎంకే స్టాలిన్ కేసును రిజ‌ర్వ్ చేసిన సుప్రీంకోర్టుఎంకే స్టాలిన్ కేసును రిజ‌ర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : త‌మిళ‌నాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది. త‌న‌పై అన్నాడీఎంకే దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై తుది తీర్పును భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు గురువారం రిజ‌ర్వ్ చేసింది.

ప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యంప్ర‌జాస్వామిక మార్గంలోనే స‌మాజంలో మార్పు సాధ్యం

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని అన్నారు. ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పునరుద్ఘాటించారు. అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి,