hyderabadupdates.com Gallery ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారం

ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారం

ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారం post thumbnail image

అమ‌రావ‌తి : ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ప‌శు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సోమ‌వారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. 2024 ఎన్నిక‌ల అనంత‌రం 13,257 గ్రామాల్లో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు. 10.48 లక్షల పశువులకు ఉచిత వైద్య సేవలు, 5.36 లక్షల పశు పోషకులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరింద‌న్నారు. అదే స్ఫూర్తితో 2026 జనవరి 19 నుంచి 31 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఉచిత‌ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం అన్నారు.
పశుసంవర్ధక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన వెన్నెముక అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. దేశంలో 2వ స్థానంలో గొర్రెలు, మేకల సంఖ్య, గ్రుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంద‌న్నారు. సుమారు 25 లక్షల రైతు కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పారు. వారి భద్రతే కూట‌మి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన కల్పించి ఉత్పాదకత పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కింజ‌రాపు అచ్చెన్నాయుడు. రూ.52 కోట్లతో 50% రాయితీపై పశుదాణా పంపిణీ , పశుపోషణ ఖర్చులు తగ్గించడం జ‌రిగింద‌న్నారు. రూ.28.32 కోట్లతో 75% రాయితీపై పశుగ్రాస విత్తనాలు, గ్రామాల్లో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామ‌న్నారు.
ఇప్పటి వరకు 58,440 గోకులాల షెడ్లు నిర్మించామ‌ని చెప్పారు. 2026–27లో మరో 50 వేల లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ అనుసంధానంతో 3 లక్షల ఎకరాల్లో 100% రాయితీపై పశుగ్రాస సాగు, ఈ క్రాప్ కూడా చేయిస్తామని అన్నారు. పశువుల అకస్మిక మరణంలో పశుపోషకుడికి భరోసా ఇచ్చేలా 85% రాయితీపై పశుబీమా పథకం అమలు చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలోని 2.32 కోట్ల గొర్రెలు, మేకలకు ఏడాదికి నాలుగు సార్లు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేశామ‌న్నారు.
The post ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌శు సంవ‌ర్ధ‌క రంగం ఆధారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?అమరావతి ఫామ్ హౌస్‌ల కోసమా? రేవ్ పార్టీల కోసమా?

అమ‌రావ‌తి : బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందన శూన్యమని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ధర్మదీక్షా స్థలిలో మీడియాతో మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం ధర్మ దీక్షకు పూనుకున్నానని అన్నారు. నేను అడుగుతున్న

Banjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్షBanjara: ఎస్టీ రిజర్వేషన్ కోసం చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష

      తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి,

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాంసంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్