hyderabadupdates.com Gallery సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో రకరకాల క్రేజీ కాంబినేషన్ లు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో ఒకటి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతిల కలయిక. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ లో మంచి భాగం పూర్తయ్యిందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్న వ్యక్తి గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా హర్ష వర్ధన్ రామేశ్వర్ ఎంపికయ్యాడు. తాజాగా “అనిమల్” చిత్రానికి ఇచ్చిన సంగీతం వల్ల జాతీయ అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు పూరి జగన్నాథ్ తో జతకట్టడం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచింది. పూరి సినిమాల్లో ఉండే ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ కి హర్ష వర్ధన్ సంగీతం ఎలా సరిపోతుందో చూడాలి.

ఇక మరోవైపు త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా ఇదే సంగీత దర్శకుడు ఉండబోతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
The post సేతుపతి కోసం లెజండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Supreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టుSupreme Court: వాట్సప్‌ లేకపోతే అరట్టై వాడండి – సుప్రీంకోర్టు

Supreme Court : వాట్సప్‌కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్‌ యాప్‌ ‘అరట్టై’ పేరు ఇటీవల నెట్టింట మార్మోగుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ (Supreme Court) దీని ప్రస్తావన వచ్చింది. వాట్సప్‌ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ

జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?జగన్ బుర్రలో లాజిక్ లు పనిచేయవా?

ఇదే వ్యవహారం సినిమాల్లో జరిగితే గనుక.. ‘ఆడికి చిప్ దొబ్బింది రా’ అనే డైలాగు వస్తుంది. ఇది రాజకీయరంగం గనుక, పైగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గనుక అలాంటి డైలాగు అంటే.. నొచ్చుకునే వాళ్లు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, ఒక్క