hyderabadupdates.com Gallery స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం

స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, తిరుమల నాయుడు, భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి స్త్రీ శక్తి పథకం పై అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం 15-08-2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3,400 రూట్లలో 7,896 ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు చెందిన 5 కేటగిరీలలో అమలు చేస్తున్నామ‌ని చెప్పారు. 2 ఫిబ్ర‌వ‌రి నాటికి 44.79 కోట్ల మహిళా ప్రయాణికులు పథకం ద్వారా ప్రయోజనం పొందారని వెల్ల‌డించారు రాం ప్ర‌సాద్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం రూ.880 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇదిలా ఉండ‌గా రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం చేసినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ PM e-Bus సేవా పథకం కింద 1,050 ఈ-సిటీ బస్సులు చేర్చనున్నామ‌ని తెలిపారు మంత్రి. అదనంగా 500 CNG బస్సులు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. మరో 500 డీజిల్ బస్సులను CNG బస్సులుగా మార్పు చేయనున్నట్లు స్ప‌ష్టం చేశారు. స్త్రీ శక్తి పథకం ప్రభుత్వానికి బరువు కాదు బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నాం అని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని నూతన బస్సులు తీసుకువస్తాం అని హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళా ప్రయాణికుల శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. ప్రతి మహిళకు సగటున నెలకు రూ.2000 వరకు లాభం కలుగుతోందని వివరించారు.
The post స్త్రీ శ‌క్తి ప‌థ‌కం కింద 44.79 కోట్ల మంది ప్ర‌యాణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Congress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయంCongress: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయం

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయంసాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లకుపైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ