hyderabadupdates.com movies హనుమంతుడి మీద కామెంట్స్ సబబేనా జక్కన్నా

హనుమంతుడి మీద కామెంట్స్ సబబేనా జక్కన్నా

నిన్న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ లో ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు వచ్చిన సాంకేతిక సమస్య రాజమౌళిని తీవ్ర అసహనానికి గురి చేసింది. అసలే ముందు రోజు రాత్రి ఎవరో రహస్యంగా ఆపరేట్ చేసిన డ్రోన్ కెమెరా వల్ల టెస్ట్ ప్లే చేయలేదనే కోపం ఆల్రెడీ నలుపుతుండగా, ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలో స్మార్ట్ స్క్రీన్స్ లో కోట్లాది మంది ఎదురు చూస్తున్న టైంలో వంద అడుగుల ఎల్ఈడి తెర కాసేపు మొండికేయడం ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన కామెంట్స్ హనుమాన్ భక్తులను ఆగ్రహానికి గురి చేస్తుండగా దీని మీద సోషల్ మీడియా చర్చ మొదలయ్యింది.

విజయేంద్రప్రసాద్ తన ప్రసంగంలో హనుమంతుడు వెనకుండి నడిపిస్తున్నాడని అన్న మాటను రాజమౌళి గుర్తు చేస్తూ ఇదేనా నడిపించడం అంటూ కాసింత నిరసన స్వరంతోనే తన అసంతృప్తిని బయట పెట్టారు. తాను దేవుళ్లను నమ్మనని కూడా పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక్కడే హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హనుమాన్ మీద చేసిన కామెంట్స్ వెనక్కు తీసుకోమంటూ ఒత్తిడి చేస్తున్నాయి. స్వయానా కన్న తండ్రే హనుమంతుడి గొప్పదనం గురించి చెప్పినప్పుడు ఒక కొడుకుగా సమర్ధించాల్సింది పోయి ఎక్కడ ఉన్నాడు దేవుడు అనడం ముమ్మాటికీ మనోభావాలను గాయపరచడమేనంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి వారణాసి కథలోనే బోలెడు దేవుళ్లున్నారు. రాముడు, శివుడు, నందీశ్వరుడు, హనుమంతుడుతో పాటు ఇంకా మనకు చూపించని గాడ్ రెఫరెన్సులు, పాత్రలు సినిమాలో ఉన్నాయి. అలాంటప్పుడు రాజమౌళి అంత మాట అన్నాడంటే కేవలం క్షణికావేశం అన్నది ఫ్యాన్స్ వాదన. దేవుడిని నమ్మకపోతే బాహుబలిలో శివ లింగానికి అంత ప్రాధాన్యం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు దేవుడి మీద నోరు పారేసుకునే సందర్భాలు ఉంటాయని, ఆ తర్వాత పశ్చత్తాప పడటం సహజమేనని బదులు చెబుతున్నారు. రాజమౌళి చేసింది రైటా రాంగా అనే దాని మీద డిబేట్ కంటే ఆయనే ఏదైనా చిన్న వీడియోలో దీని గురించి క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ అనేది మూవీ లవర్స్ అభిప్రాయం.

Related Post

తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు కీలక విషయాలపై ఆయన ప్రధానితో చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత తొలిసారి కలిసిన నేపథ్యంలో