hyderabadupdates.com Gallery హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం

హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం

హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం post thumbnail image

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. సీఎం సిద్ద‌రామ‌య్య ను మారుస్తారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈత‌రుణంలో దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సంబంధించి సిద్దరామయ్య, నేను కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సరైన సమయంలో అది సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీలో ఎటువంటి సమస్యలూ లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఏ నిర్ణయం అయితే జరిగిందో, అది ఆ ప్రకారమే అమలవుతుందని డి.కె. శివకుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నాయకత్వ సమస్యకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌న్నారు. తాను ముందు నుంచీ పార్టీని న‌మ్ముకుని ఉన్నాన‌ని, ఎన్నో ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ తాను ఏనాడూ పార్టీ లైన్ దాట‌లేద‌ని చెప్పారు డీకే శివ‌కుమార్. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, అలాగే కర్ణాటకలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీ తర్వాత, రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని పార్టీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో శివకుమార్ చేసిన కామెంట్స్ తీవ్ర ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.
The post హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు

Labour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయంLabour Law Reforms: కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం

    కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నాలుగు కార్మిక కోడ్‌ (స్మృతి)లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు

ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ

ముంబై : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ అరుదైన ఘ‌న‌త సాధించారు. త‌ను మ‌రో వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండ‌గా గౌత‌మ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో