దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.