hyderabadupdates.com movies 33 వేల రూపాయలతో సినిమా తీయొచ్చు

33 వేల రూపాయలతో సినిమా తీయొచ్చు

హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో షార్ట్ ఫిలిం తీయడమే అసాధ్యం. అలాంటిది ఒక ఫీచర్ ఫిలిం అసలు ఊహించుకోలేం. కానీ దర్శకుడు రాహి అనిల్ బర్వే దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాని 80 నిమిషాల నిడివితో రూపొందించి త్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నాడు. అసలు ట్విస్టులు ఇంకా ఉన్నాయి.

మన్ పిశాచ్ మొత్తం 60 పేజీల స్క్రిప్ట్. చేత్తో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్ లో తీసుకున్న వీడియో రికార్డింగ్స్, ఫోటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడి దీన్ని పూర్తి చేశారు. కేవలం ఇద్దరు ఆర్టిస్టులు మాత్రమే ఉంటారు. యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే తప్ప ఇంకెవరు వేరే నటీనటులు కనిపించరు. పురావస్తు శాఖకు చెందిన ఒక ఆఫీసర్ సదాశివరావ్ హడమ్ గావ్ అనే ఊరికి వెళ్తాడు. కొండలో నుంచి బయటపడ్డ పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు బరిలో దిగుతాడు.

ఒక పడుచు విధవ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. చీకటి పడగానే విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకునే హడమ్ గావ్ లో అతనికి ఎదురైన దారుణమైన అనుభవాలే మన్ పిశాచ్ స్టోరీ. ట్రైలర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏఐ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నా అసలు 33 వేల రూపాయల్లో ఈ మాత్రం క్వాలిటీ చూపించడం షాక్ కలిగించే విషయం. భవిషత్తులో ఫిలిం మేకింగ్ మీద కృత్రిమ మేధస్సు ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ.

దీన్ని అనిల్ జీరో బడ్జెట్ ఎక్స్ పరిమెంటల్ ఫిలింగా వర్ణిస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో క్లూ ఇస్తున్నాడు. 1960లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మన్ పిశాచ్ రాసుకున్నారు. తుంబాడ్ లాగా ఇది కూడా సక్సెస్ అయితే కొత్త సంచలనానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. అయినా నలభై వేలకే ఇంత అవుట్ ఫుట్ రాబడితే ఒకవేళ రెండు మూడు కోట్లు కేటాయించగలిగితే ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోని క్వాలిటీ వస్తుందేమో.

Related Post

`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!`ఎర్ర‌చంద‌నం`పై ప‌వ‌న్ భేషైన ఆలోచ‌న‌… బాబు కితాబు!

ఎర్ర‌చంద‌నం.. ఏపీలో మాత్ర‌మే.. అది కూడా తిరుప‌తి జిల్లాలోని శేషాచ‌లం అడ‌వుల్లో మాత్ర‌మే ల‌భించే అరుదైన వృక్షాలు. అయితే.. వీటిని అక్ర‌మార్కులు తెగ‌న‌రికి పెద్ద ఎత్తున ర‌వాణా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి అమాయ‌కులైన ఏపీ, తెలంగాణ పౌరుల‌ను, కూలీల‌ను

వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్వద్దే వద్దంటున్న అజిత్ ఫ్యాన్స్

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్‌కు వీరం, వేదాళం, విశ్వాసం చిత్రాలతో మరపురాని విజయాలు అందించాడు దర్శకుడు శివ. తమిళంలో ఒకప్పుడు పేరున్న సినిమాటోగ్రాఫర్ అయిన శివ.. తెలుగులో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం. గోపీచంద్ హీరోగా శౌర్యం, శంఖం సినిమాలు