hyderabadupdates.com Gallery 33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు

33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు

33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం రేవంత్ రెడ్డ ఆదేశాల మేర‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా సీఎస్ ఆదేశాల మేర‌కు గురువారం రూ. 5.80 కోట్లు మంజూరు చేశారు. ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీటిని మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. డిసెంబర్ 9న విగ్రహ ఆవిష్కరణ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్‌లలో (ఐడిఓసిలు) తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండ‌గా రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ఈ పనికి రూ.5.80 కోట్లు కేటాయించాలని , ఖర్చును భరించడానికి కూడా అనుమతిని మంజూరు చేసింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ మొత్తానికి పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ఇందుకు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు. నిధుల‌ను మంజూరు చేసింది వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్ర‌భుత్వ ప‌ర్యవేక్ష‌ణ‌లోనే తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు స‌ద‌రు ఉన్న‌తాధకారి.
ఇదిలా ఉండ‌గా రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లోని స‌చివాల‌య ప్రాంగ‌ణ‌లో భారీ ఖ‌ర్చుతో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసింది స‌ర్కార్. గ‌తంలో బీఆర్ఎస్ హ‌యాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి కాకుండా కొన్ని మార్పులు చేసింది. దీనిని త‌ప్పు ప‌ట్టారు గులాబీ నేత‌లు. ఇది పూర్తిగా ఆంధ్రా త‌ల్లిగా ఉందంటూ పేర్కొన్నారు.
The post 33 జిల్లాల్లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ande Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూతAnde Sri: ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత

    ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందెశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ

ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదాఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఎఫెక్ట్ ‘టాక్సిక్’ వాయిదా

బెంగ‌ళూరు : గీతా మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కీల‌క పాత్ర పోషిస్తున్న మూవీ కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇప్ప‌టికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు