hyderabadupdates.com Gallery 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు post thumbnail image

అమరావతి : ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రులు ఎస్.సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో జరగనున్న ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 ఎంవోయూలు చేసుకోనున్నట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సెర్ప్, చేనేత, జౌళి శాఖ, సీఆర్డీయే, గుంటూరు జిల్లా అధికారులతో మంత్రులు సవిత, సంధ్యారాణి సమావేశం నిర్వహించారు. అమరావతిలోని పేరెడ్స్ గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారన్నారు.
ఈ సందర్భంగా మహిళలకు మేలు కలిగేలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దే క్రమంలో పలు ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సీఎం సమక్షంలో 36 ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళలతో ల్యాప్ టాప్ బ్యాగులు, క్యారీ బ్యాగులు, రెడీ మేడ్ దుస్తుల తయారీకి శిక్షణ ఇవ్వడదానికి సెర్ప్ తో ఆప్కో ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిపారు. సీఎం చేతుల మీదుగా నాలుగు ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు (కర్నూలు), చీరాల (బాపట్ల), రాజాం (విజయనగరం), పొందూరు (శ్రీకాకుళం)లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. మహిళా దినోత్సవ‌ వేడుకల సందర్భంగా 23 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా డ్వాకా మహిళా సంఘాలకు రుణాల అందజేయనున్నామన్నారు. మిల్లెట్ కార్ట్ లు 2, ఎగ్ కార్ట్ లు 5, రైతు బజారు వ్యాన్ 1, బొలెరో వాహనాలు రెండు, ఆటోలు 5, ట్రాక్టర్లు 5, ర్యాపిడో ద్విచక్ర వాహనాలు 5 మహిళ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు అందజేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు, ఫ్రీ బస్, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు అమలు చేశామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖా రాణి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్య కుమారి, సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ, గుంటూరు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
The post 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌నక‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌జా పాల‌న పేరుతో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేస్తున్నారంటూ ఆవేద‌న

టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌

తిరుమల : ప్ర‌పంచంలోనే అత్యంత అధిక ఆదాయం క‌లిగిన ఏకైక ఆల‌యంగా వినుతికెక్కిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ఇప్ప‌టికే నియ‌మితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ ర‌విచంద్ర ఇవాళ పూర్తి స్తాయిలో

సీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపుసీఎస్ కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగింపు

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్న కె. రామ‌కృష్ణారావు ప‌ద‌వీ కాలం పొడిగించేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం