hyderabadupdates.com movies ఇంకో పెద్ద స్టేట్మెంట్.. తుస్సుమంది

ఇంకో పెద్ద స్టేట్మెంట్.. తుస్సుమంది

తమ సినిమాల గురించి పాజిటివ్‌గా మాట్లాడ్డం వరకు ఓకే. కొంచెం ఎగ్జాజరేట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ అత్యుత్సాహంతో భారీ స్టేట్మెంట్లు ఇస్తేనే చాలా కష్టమవుతుంది. రిలీజ్‌కు ముందు అలాంటి స్టేట్మెంట్లు సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌ను తెలియజేయొచ్చు. ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి రేకెత్తించవచ్చు. కానీ ఏదైనా తేడా కొడితే.. డ్యామేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ కామెంట్లు ట్రోల్ మెటీరియల్‌గా మారతాయి. సినిమాకు చేటు చేస్తాయి. 

ఇటీవల సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనకు తలనొప్పిగా మారేలా ఉంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు షాక్ కాకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఐతే రాజేంద్ర ప్రసాద్ పాజిటివ్ కోణంలో ‘షాక్’ అవుతారు అంటే.. ఆడియన్స్ ఇంకో రకంగా షాకయ్యారు. ఈ రోజుల్లో ఇంత రొటీన్ సినిమా తీసి మెప్పించగలమని ఎలా అనుకున్నారు అనుకుంటూ షాకవుతున్నారు. 

అసలు రాజేంద్ర ప్రసాద్ పాత్రలో ఏమంత విషయం ఉందని అంత ఎగ్జైట్ అయ్యారు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇలా సినీ జనాలు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇబ్బంది పడడం ఇదే తొలిసారి కాదు. గతంలో విశ్వక్సేన్ ‘పాగల్’ అనే సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

నేచురల్ స్టార్ నాని ‘కోర్టు’ మూవీ గురించి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని అన్నాడు. కానీ ఆ సినిమా హిట్టయి నాని మాటకు విలువ చేకూర్చింది. ఐతే కానీ ‘కోర్టు’లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి.. నానిని అనుకరిస్తూ ‘మిత్రమండలి’ సినిమా విషయంలో సేమ్ ఇలాంటి ఛాలెంజే విసిరాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అందుకే సినిమాకు హైప్ ఇవ్వడం కోసం మరీ పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకపోవడం మంచిది.

Related Post

Kantara Chapter 1: Rishab Shetty’s film gets massive ticket rate hike in AP
Kantara Chapter 1: Rishab Shetty’s film gets massive ticket rate hike in AP

AP Deputy CM Pawan Kalyan showed his big heart by permitting ticket rate hikes for Kannada film Kantara: Chapter 1, despite Telugu films facing several obstacles in Karnataka lately. Today,

కొత్తవి వ‌ద్దు.. పాత‌వే ముద్దుకొత్తవి వ‌ద్దు.. పాత‌వే ముద్దు

గ‌త నెల ఆరంభంలో లిటిల్ హార్ట్స్‌తో మొద‌లుపెట్టి.. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో డ్రీమ్ ర‌న్ కొన‌సాగుతోంది. ఆ సినిమా కొన్ని వారాల పాటు మంచి వ‌సూళ్లు సాధించింది. త‌ర్వాతి వారం వ‌చ్చిన మిరాయ్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కిష్కింధ‌పురి సైతం బాగా

Natural Star Nani Unveiled Gripping New Mystical Trailer Of Aadi ShambhalaNatural Star Nani Unveiled Gripping New Mystical Trailer Of Aadi Shambhala

Aadi Saikumar’s mystical thriller Shambhala: A Mystical World, directed by Ugandhar Muni and produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, is gearing up for a