hyderabadupdates.com movies మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

మ‌రో 30 రోజులే గ‌డువు.. జిల్లాల వ్యూహం ఏమ‌వుతుంది ..!

రాష్ట్రంలో జిల్లాల విభజన, డివిజన్‌ల‌ విభజన, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన సమయం మరో 30 రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 20 కల్లా కొత్త జిల్లాల‌ సరిహద్దులను లేదా కొత్త డివిజన్ల‌ సరిహద్దులను నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది. డిసెంబర్ 21వ తేదీ తర్వాత ఇక జిల్లాల సరిహద్దులు, మండలాల సరిహద్దులు, డివిజన్ల‌ సరిహద్దులు మార్చడానికి వీలు లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లోని గణాంకాల శాఖ స్పష్టం చేసింది.

దీని ప్రకారం మరో 30 రోజులు మాత్రమే ప్రభుత్వానికి జిల్లాల విషయంలో సమయం కనిపిస్తుంది. కానీ, ఇప్పటికీ చాలావరకు జిల్లాల విభజన అదేవిధంగా మండలాల సరిహద్దుల మార్పు వంటి విషయంలో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం, మదనపల్లె జిల్లాలను కొత్తగా ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. అక్కడ నుంచి కూడా అనేక మార్పులు చేర్పులు చేయాలని విజ్ఞాపనలు అందుతున్నాయి. అదే సమయంలో రాజంపేట జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్ తెర‌ మీదకు వచ్చింది.

ఇది అత్యంత కీలకమైన డిమాండ్‌. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో కీలకమైన రాజంపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది. రాజంపేట‌ను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టిస్తే.. మొత్తం కడప జిల్లా పై ప్రభావం చూపించి వచ్చే ఎన్నికల నాటికి టిడిపి పుంజుకునే అవకాశం ఉంటుందన్న చర్చ కొనసాగుతోంది. కానీ ఈ విషయంలో ఇంకా అసలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడం, జిల్లాలకు పేర్లు మార్పు ఇలా రకరకాల అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.

అనేక డిమాండ్లు పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం దాదాపు రెండువేల కుపైగా విజ్ఞాపనలు, విన్నపాలు పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. ఏ విధంగా జిల్లాలను విభజిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చూస్తే సీఎం చంద్రబాబు చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్త‌న్నారు. అనంతరం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లాల విభజనకు ఏ మేరకు ఆయన సమయం కేటాయిస్తారు ఎంతవరకు వీటిలో సక్సెస్ అవుతారు అనేది చూడాలి. ఈ విషయంలో ఆద‌రా బాద‌రాగా చేస్తే మళ్ళీ వైసిపి హయాంలో వచ్చినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related Post

ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్

​క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి

ప్యారడైజ్ లో ఎంతమంది విలన్లు ఓదెలా…ప్యారడైజ్ లో ఎంతమంది విలన్లు ఓదెలా…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. కేవలం నాని మార్కెట్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సెట్ చేస్తున్న కాస్టింగ్ చూస్తుంటే ఆడియన్స్‌కు పిచ్చెక్కుతోంది. ముఖ్యంగా