hyderabadupdates.com Gallery Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్

Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్ post thumbnail image

 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తాజ్ మహల్‌ను సందర్శించారు. సుమారు గంటసేపు తాజ్ ఆవరణలో గడిపారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆగ్రాకు చేరుకున్న ఆయన… అక్కడి డయానా బెంచ్‌ సహా పలు ఏరియాల్లో ఫొటోలు దిగినట్టు తెలిపారు. అంతకముందు.. అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పాటు సుమారు 40 దేశాలకు చెందిన 126 మంది అతిథులతో కూడిన ఓ పెద్ద బృందంతో ఉత్తర్ ప్రదేశ్‌కు చేరుకున్నారు ట్రంప్ జూనియర్. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగే భారతీయ అమెరికన్ జంట హై ప్రొఫైల్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఆయన భారత్‌ కు విచ్ఛేశారు. ఈ రాత్రికి ఆయన ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నట్టు తెలుస్తోంది.
 
ట్రంప్ జూనియర్ హాజరయ్యే ఈ వేడుకకు.. దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులూ వస్తారని సమాచారం. ట్రంప్ జూనియర్ రాక నేపథ్యంలో ఇప్పటికే అక్కడి అధికార యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేసింది. ఆయన భారత పర్యటనకు ముందే.. ఇక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు అమెరికా భద్రతా బృందం ఉదయపూర్ చేరుకుంది. ఏసీపీ(ACP), ఏడీసీ(ADC) స్థాయి అధికారులతో సహా సుమారు 200 మంది పోలీస్ సిబ్బందిని మోహరించారు. ట్రంప్ జూనియర్ భారత్‌కు రావడం ఇది రెండోసారి. గతంలో ఆయన 2018 ఫిబ్రవరిలో తొలిసారిగా ఇండియాలో పర్యటించారు. అప్పుడు.. న్యూఢిల్లీ, ముంబయి, పుణె, కోల్‌కతాలను సందర్శించారు.
The post Trump Junior: తాజ్‌మహల్‌ను సందర్శించిన జూనియర్ ట్రంప్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలుIAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

    రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు.

Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !Bihar Assembly Elections: బిహార్‌లో రికార్డుస్థాయి పోలింగ్‌ ! తొలిదశలో 65% ఓటింగ్ !

    బిహార్‌ శాసనసభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండగ వాతావరణంలో జరిగిన ఓటింగులో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్‌

Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !Water Awards: ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’లో తెలంగాణ జయకేతనం !

    జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు–2024లో తెలంగాణ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ‘జల్‌ సంచయ్‌ జన్‌ భాగీదారీ’విభాగంలో తెలంగాణ టాప్‌లో నిలిచి సత్తా