hyderabadupdates.com movies మహమ్మద్ కుట్టి మమ్ముట్టిగా ఎలా మారాడు?

మహమ్మద్ కుట్టి మమ్ముట్టిగా ఎలా మారాడు?

మలయాళ సినీ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడు మమ్ముట్టి. ఆ ఇండస్ట్రీకి మోహన్ లాల్ ఒక కన్ను అయితే.. మరో కన్ను మమ్ముట్టి. నటుడిగా ఆయన గొప్పదనమేంటో స్వాతికిరణం, దళపతి సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఇక ఆయన అందుకున్న బాక్సాఫీస్ విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 70 ఏళ్లు పైబడ్డా ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, హిట్లు కొడుతూ దూసుకెళ్తున్నాడు మమ్ముట్టి. 

ఐతే నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్‌ను పూర్తి చేసుకుంటున్న మమ్ముట్టి.. ఇప్పటిదాకా తన పేరు వెనుక ఉన్న కథేంటన్నది మాత్రం ఎవరికీ చెప్పలేదు. తన అసలు పేరు మమ్ముట్టి అది కాదని చెబుతూ ఆ పేరు తనకు ఎలా వచ్చిందో ఆయన తాజాగా ఒక వేడుకలో ఆయన వెల్లడించారు. తన ఫ్రెండు అనుకోకుండా తనకు ‘మమ్ముట్టి’ అనే పేరు పెట్టడం వెనుక స్టోరీని ఆయన బయటపెట్టారు.

మమ్ముట్టి అసలు పేరు.. మహమ్మద్ కుట్టి అట. కానీ తాను కాలేజీలో చదివే రోజుల్లో ఆ పేరును దాచిపెట్టి ఒమర్ షరీఫ్ అనే పేరుతో చలామణి అయినట్లు మమ్ముట్టి తెలిపాడు. ఐతే ఒక రోజు తాను కాలేజీలో ఐడీ కార్డ్ మరిచిపోయి ఇంటికి వెళ్లిపోయానని.. ఆ కార్డు తన ఫ్రెండుకు దొరికిందని మమ్ముట్టి తెలిపాడు. ఆ ఫ్రెండు తన పేరును పొరపాటున ‘మమ్ముట్టి’ అని అందరికీ చెప్పాడని.. ఆ పేరే కాలేజీలో పాపులర్ అయిందని.. సినీ రంగంలో కూడా అదే పేరుతో కంటిన్యూ అయ్యానని మమ్ముట్టి తెలిపాడు. 

ఈ కథ అంతా చెబుతూ.. తనకు ‘మమ్ముట్టి’ అనే పేరు పెట్టిన స్నేహితుడిని వేదిక మీదికి పిలిచి అందరికీ పరిచయం చేశాడు మమ్ముట్టి. ఆ ఫ్రెండు పేరు.. శశిధరన్ అని చెప్పాడు. తన పేరు గురించి మీడియాలో ఇప్పటిదాకా అనేక కథనాలు వచ్చాయని.. అవేమీ నిజం కాదని.. అసలు కథ ఇదని మమ్ముట్టి తెలిపాడు. ఇప్పటిదాకా 420 సినిమాల్లో నటించిన మమ్ముట్టి ప్రస్తుతం ‘కళంకావల్’ అనే చిత్రం చేస్తున్నాడు.

Related Post

ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుందిఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుంది

బంగాళాఖాతంలో వాతావరణం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. అరుదైన తుఫాను ‘సెన్యార్’ ముప్పు మన దేశానికి తప్పింది అనుకునేలోపే, మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. రాబోయే 12 గంటల్లో ఇది

‘సంతానం’ కోసం సరదాలు ఇబ్బందులు‘సంతానం’ కోసం సరదాలు ఇబ్బందులు

స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దాంతో ఎంత బాగా ఆడియన్స్ ని మెప్పించగలిగితే అంత వసూళ్లు చూడొచ్చు. బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఎన్నో సూపర్ హిట్స్