hyderabadupdates.com movies కేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్టు

కేసీఆర్ పేరు లేకుండానే కవిత తెలంగాణ పోస్టు

తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ లతో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొద్ది రోజులుగా దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై, కేటీఆర్ పై, హరీష్ రావుపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే, తాజాగా కేసీఆర్ పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడని వైనం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుడి దీక్ష వల్ల తెలంగాణ వచ్చిందంటూ కవిత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే కవితపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ యోధుడి పేరెత్తేందుకు కూడా కవిత ఇష్టపడడం లేదని, కానీ, ఆయన వల్లే కవిత ఇన్నాళ్లూ పదవులు అనుభవించిన విషయాన్ని మరిచిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా కవిత ఉనికి లేదని, అటువంటి నాయకుడిని సొంత కూతురైన కవిత విస్మరించడం ఏంటని మండిపడుతున్నారు. కేసీఆర్ పై ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తుంటే కన్న కూతురు మాత్రం ఈ రకంగా అవమానిస్తోందని అంటున్నారు.

కేసీఆర్ ఫొటో లేకుండా కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. కేసీఆర్ ఇమేజ్ లేకుండా కవిత పోస్ట్ చేశారని, కానీ, ఇన్నాళ్లూ ఆయన ఇమేజ్ వాడుకొని కవిత రాజకీయల్లో ఎన్నో పదవులు చేపట్టారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కవితకు సొంతగా ఇమేజ్ ఉందనుకుంటే రాబోయే ఎన్నికల్లో సొంతగా తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేసి గెలవాలని నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.

ఒక యోధుని దీక్ష అమరుల త్యాగం యావత్ తెలంగాణ ..జాతికి మేలుకొలుపైంది ..ఐక్యతా గీతమైంది ..ఉద్యమ స్ఫూర్తిని నింపింది తెలంగాణ ఉద్యమాన్ని  విజయపథం వైపు నడిపింది !!!రాష్ట్ర సాధనకు దారి దీపమైంది !!!భౌగోళిక తెలంగాణ సాధించాం !!సామాజిక తెలంగాణ సాధిస్తాం !!జై…— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2025

Related Post

మళ్ళీ రాజశేఖరుడితో రమ్యకృష్ణమళ్ళీ రాజశేఖరుడితో రమ్యకృష్ణ

90వ దశకంలో అప్పటి తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన సినిమా.. అల్లరి ప్రియుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణల మధ్య కెమిస్ట్రీ..

మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?మున్సిపల్ పోటీలో ఎవరిది పైచేయి?

అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి