hyderabadupdates.com movies నిధి పాప నోట.. ‘బాబులకే బాబు’ మాట

నిధి పాప నోట.. ‘బాబులకే బాబు’ మాట

కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని, తెలుగులో మాట్లాడ్డమే కాదు.. ఇక్కడి కల్చర్‌కు తగ్గట్లుగా వ్యవహరిస్తుంటారు. అభిమానులు హీరోలు, హీరోయిన్ల విషయంలో చేసే కామెంట్లు, నినాదాల గురించి కూడా తెలుసుకుని.. వాటిని స్టేజ్‌ల మీద, ఇంటర్వ్యూలో ప్రస్తావించి ఆశ్చర్యపరుస్తుంటారు. నిధి అగర్వాల్ ఈ కోవకే చెందుతుంది. 

తన మాటతీరు, నడవడిక, కమిట్మెంట్‌తో తాను పని చేస్తున్న స్టార్ హీరోల అభిమానులను ఆమె అమితంగా ఆకట్టుకుంటోంది. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆలస్యమైనప్పటికీ కొన్నేళ్ల పాటు ఓపిగ్గా ఎదురు చూస్తూ ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ నిధి.. రిలీజ్ టైంలో ప్రమోషన్ల కోసం ఎలా కాళ్లరిగేలా తిరిగిందో తెలిసిందే. స్వయంగా పవన్ ఆమెను చూస్తే తనకు సిగ్గుగా ఉందన్నాడు.

ఇక తన కొత్త చిత్రం ‘రాజాసాబ్’ కోసం కూడా అలాగే శ్రమిస్తోంది నిధి. ఒక ఈవెంట్ సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డా కూడా ఫ్యాన్స్‌ను పల్లెత్తు మాట అనలేదు. వారి మీద కేసులు పెట్టమంటే వద్దంది. కట్ చేస్తే ఒక ఇంటర్వ్యూలో ఆమె పవన్ కళ్యాణ్, ప్రభాస్‌ల గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు ఏమంటారు అని అడిగితే.. ‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’ అంటూ ఫ్యాన్స్ ఈవెంట్లలో వల్లెవేసే మాటను చెప్పింది నిధి. 

మరి ప్రభాస్ గురించి ఏమంటారు అంటే.. ‘‘రాజులకే రాజు ప్రభాస్ రాజు’’ అనే నినాదం గురించి చెప్పింది. మరి మీ గురించి ఫ్యాన్స్ అభిప్రాయం ఏంటి అంటే.. ‘‘పాపలకే పాప నిధి పాప’’ అంటూ నవ్వేసింది నిధి. ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగితే.. సినిమా ఈవెంట్లకు వెళ్తే ఇలాంటి నినాదాలతోనే అభిమానులు హోరెత్తిస్తుంటారని.. అందుకే తనకు అవి కంఠతా వచ్చేశాయని నిధి చెప్పింది. డిజాస్టర్ అయిన ‘హరిహర వీరమల్లు’ సినిమా వల్ల కూడా తనకు మేలే జరిగిందని.. తనకు పెర్ఫామర్‌గా పేరు రావడం సంతోషం కలిగించిందని ఆమె చెప్పడం విశేషం.

Related Post

క్యూర్‌-ప్యూర్‌-రేర్‌… రేవంత్ సరికొత్త మంత్రంక్యూర్‌-ప్యూర్‌-రేర్‌… రేవంత్ సరికొత్త మంత్రం

తెలంగాణ అభివృద్ధికి, విజ‌న్‌-2047 సాకారానికి `క్యూర్‌-ప్యూర్‌-రేర్‌` అనే మంత్రుల‌ను ప‌ఠిస్తున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విజ‌న్ తెలంగాణ‌-2047లో రెండు ప్ర‌ధాన అంశాలు ఉన్నాయ‌ని తెలిపారు. 1) విజ‌న్‌, 2) వ్యూహం. ఈ రెండు ప్ర‌ధాన అంశాల‌ను సాకారం చేసుకునే దిశ‌గా

‘Malli Malli’ Song from Barabar Premistha Wins Hearts, Launched by Jayanth C Paranjee‘Malli Malli’ Song from Barabar Premistha Wins Hearts, Launched by Jayanth C Paranjee

The romantic melody Malli Malli from the upcoming Telugu film Barabar Premistha has been officially released, adding fresh excitement around the movie. The song was launched by renowned director Jayanth