hyderabadupdates.com Gallery టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ post thumbnail image

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ ను నియ‌మించిన‌ట్లు తెలిపింది. టెక్నో పెయింట్స్ 2026-27 నాటికి తన ఐపీఓ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను దేశంలోనే కాదు వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన ప్లేయ‌ర్ గా త‌న‌కు పేరుంది. త‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డం వెనుక భారీ మార్కెట్ స్ట్రాట‌జీ దాగి ఉంద‌ని తేలి పోయింది. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఆస్తుల‌ను పోగేశాడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. త‌ను ముందు నుంచి భ‌విష్య‌త్తు కోసం కొంత దాచుకోవ‌డం, పెట్టుబ‌డులు పెడుతూ వ‌చ్చాడు.
ఇదే స‌మ‌యంలో త‌న‌తో పాటు ఆడిన చిన్న‌నాటి స్నేహితుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లి మాత్రం చెడు అల‌వాట్ల కార‌ణంగా త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ ఇచ్చే నెల నెలా పెన్ష‌న్ తోనే బ‌తుకుతున్నాడు. ఆ మ‌ధ్య‌న అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో కొంత సాయం చేశాడు స‌చిన్ టెండూల్క‌ర్. ఇదిలా ఉండ‌గా పెయింట్స్ త‌యారీ సంస్థ మూడు సంవ‌త్స‌రాల పాటు త‌మ కంపెనీకి రాయ‌బారిగా ఉంటార‌ని తెలిపింది. కాగా గ‌త 25 సంవ‌త్స‌రాల పాటు పెయింట్స్ రంగంలో స్థిర‌మైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీని కార‌ణంగా మ‌రింత‌గా ఆదాయాన్ని పెంచుకునే దిశ‌గా పావులు క‌దిపింది. ఈ మేర‌కు స‌చిన్ తో ఒప్పందం ఖ‌రారు చేసుకుంది.
The post టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యంLokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids : మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా… నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. ఇక ఆయన ఫామ్‌హౌస్‌లో

మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రం అరెస్ట్ త‌ప్ప‌దా..?

న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి పి . చిదంబ‌రం అరెస్ట్ కాక త‌ప్ప‌దా. ఆ దిశ‌గా ఈడీ రంగంలోకి దిగింది. ఎయిర్‌సెల్ మాక్సిస్ డీల్‌లో మనీలాండరింగ్ నేరానికి సంబంధించి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్ర కాంపిటెంట్ అథారిటీ నుండి అందుకున్న

NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసుNIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు

  దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ‘ఎన్‌ఐఏ’ ఉగ్రవాద సంబంధిత కేసులను