hyderabadupdates.com Gallery న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు

న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం మ‌హిళా ఐఏఎస్ ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసింది. ఇందుకు సంబంధించి ఎన్టీవీ న్యూస్ ఛాన‌ల్ తో పాటు ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ల్స్ ల‌లో పెద్ద ఎత్తున క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఆయా సామాజిక వేదిక‌ల ద్వారా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా న‌ల్ల‌గొండ జిల్లాలో రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రిగా ఉన్న కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌ద‌రు మ‌హిళా ఐఏఎస్ తో ప్రేమాయ‌ణం న‌డిపారంటూ సంచ‌ల‌న ప్ర‌త్యేక క‌థ‌నం ఎన్టీవీలో ప్ర‌సారం అయ్యింది. దీనిని ఆధారంగా చేసుకుని మిగ‌తా యూట్యూబ్ ఛాన‌ల్స్ కూడా పెద్ద ఎత్తున స్టోరీస్ తో పాటు చ‌ర్చ‌లు కూడా చేశారు. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ రాష్ట్ర వ్య‌వ‌హారాల‌లో పెను సంచ‌ల‌నం రేపింది. ఈ త‌రుణంలో మ‌హిళా ఐఏఎస్ ను వ్య‌క్తిగ‌తంగా ఇమేజ్ డ్యామేజ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్. ఈ మేర‌కు ఆయ‌న ఖండిస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. తాజాగా సోమ‌వారం అసోసియేష‌న్ త‌ర‌పున పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మ‌హిళా ఐఏఎస్ , మంత్రికి లింకు పెడుతూ స్టోరీ టెలికాస్ట్ చేసిన ఎన్టీవీతో స‌హా పలు న్యూస్ చానల్స్, సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలంగాణ ఐఏఎస్ అసోసియేషన్. అసోసియేషన్ తరపున ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్.
The post న్యూస్ హ్యాండిల్స్ పై జ‌యేష్ రంజ‌న్ ఫిర్యాదు..కేసు నమోదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Madvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతంMadvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతం

    మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ

తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!తన రచ్చలోకి జగన్ లాగుతున్న పేర్ని నాని!

అవును మరి.. వివాదం పుట్టించినా సరే.. నిజాలను మాత్రమే ప్రచారం చేస్తే దానికి పెద్ద ప్రజాదరణ ఉండదు. సోషల్ మీడియాల్లో వైరల్ చేయడమే జీవితంగా అందరూ బతుకుతున్న రోజులివి. మరి మామూలు వివాదానికి కూడా సెలబ్రిటీని జోడిస్తే.. దానికి క్రేజ్ పెరుగుతుంది

Indiramma Saree: ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీIndiramma Saree: ఇందిరాగాంధీ జయంతికి చీరల పంపిణీ

Indiramma Saree : బతుకమ్మ, దసరా పండగనాటికి మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన చీరల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ చీరల పంపిణీని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజైన నవంబర్‌