hyderabadupdates.com Gallery 20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి

20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి

20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి post thumbnail image

ఢిల్లీ : టీవీకే పార్టీ చీఫ్‌, తమిళ సినీ రంగంలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే విజ‌య్ న‌టించిన జ‌య నాయ‌గ‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా చిత్రానికి సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే స‌మ‌యంలో ధ‌ర్మాస‌నం కీల‌క సూచ‌న చేసింది. జనవరి 20వ తేదీలోగా ఈ కేసును పరిష్కరించాలని మద్రాస్ హైకోర్టును ఆదేశించింది. సినిమా ధృవీకరణ ప్రక్రియను నిలిపి వేసింది మ‌ద్రాస్ హైకోర్టు. ఈ సంద‌ర్బంగా జ‌న నాయ‌గ‌న్ త‌ర‌పున లాయ‌ర్ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానంలో మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించాలని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎ.జి. మసిహ్ లతో కూడిన ధర్మాసనం దీనిపై విచార‌ణ చేప‌ట్టింది గురువారం.
విచార‌ణ అనంత‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ పిటిష‌న్ పై తాము జోక్యం చేసుకోమ‌ని, అయితే జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల తేదీకి సంబంధించి త‌క్ష‌ణ‌మే ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ పిటిషన్‌ను చిత్ర నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి దాఖలు చేసింది. చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి ఇచ్చిన మునుపటి ఆదేశంపై స్టే విధించిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వును నిర్మాత సవాలు చేశారు. ఇదిలా ఉండ‌గా జన నాయగన్ జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల చేయాలని ప్రణాళిక వేసుకున్నారు . ఇప్ప‌టికే మూవీ రిలీజ్ కు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో జ‌న నాయ‌గ‌న్ విడుద‌ల ఆగి పోయింది.
The post 20వ తేదీ లోగా జ‌న నాయ‌గ‌న్ పై తీర్పు ఇవ్వండి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండిఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యంఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ముంబై : క్రికెట్ ఆట‌లో ఉన్న మ‌జా ఏమిటో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ తెలియ చేసింది. అందుకే కోట్లాది మంది క్రికెట్ అంటే ప‌డి చ‌స్తారు. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగిన ఈ కీల‌క పోరు

YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్YS Jagan: మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం – వైఎస్ జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గురువారం పర్యటించారు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ సందర్శన కోసం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్‌ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా