hyderabadupdates.com Gallery తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం

తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం

తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంత‌పు అస్తిత్వానికి భంగం క‌లిగించేలా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ‌నివారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలుగా పెద్ద నగరంగా విస్తరించాయని అన్నారు. ఈ రెండు నగరాలు ప్రపంచ వ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయని పేర్కొన్నారు. గతంలో పుస్తకాల్లో తుగ్ల‌క్ గురించి అంతా చ‌దువుకున్నార‌ని, ఇవాళ తుగ్లక్ పాలన అంటే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడు చేతిలో రాయిలా మారిందన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పాల‌న చేత‌కాక చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు కేటీఆర్. హామీల అమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైనే ఫోకస్ పెట్టాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు. ఆ త‌ర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు. అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తీసివేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్. వీటన్నిటి వలన ప్రజలకు ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇలాంటి పిచ్చి పనులు తుగ్లక్ పనులు తప్పించి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌న్నారు.
ప్రజల దగ్గరికి పాలన పోవాలని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వికేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ఆనాడు ప్రారంభించారని గుర్తు చేశారు కేటీఆర్. ఇందులో భాగంగానే కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశార‌ని అన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని చెప్పారు. హైదరాబాదులోనూ వార్డులను, జోన్లను పెంచడం జరిగిందన్నారు.
వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగిందన్నారు.
The post తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు శాంస‌న్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్సంజు శాంస‌న్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్

దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌తి నెలా క్రికెట్ కు సంబంధించి అత్యుత్త‌మ ఆట‌గాడిని ఎంపిక చేస్తుంది. ఈసారి మార్చి నెల‌కు సంబంధించి ఐసీసీ బెస్ట్ ప్లేయ‌ర్ అవార్డును ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా కేర‌ళ

ReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలుReNew Energy Global: రూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులకు కుదిరిన ఒప్పందాలు

  గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తిరిగి రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే 30వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సమావేశాలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పునరుత్పాదక విద్యుత్ రంగంలో

Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

    ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌