విజయవాడ : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీలో మద్యం స్కాంకు సంబంధించి ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శనివారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు జారీ చేసింది. జనవరి 22న తమ ముందు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. విచారణలో భాగంగా ఆయన పాత్ర, సంబధిత ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ఉన్నట్టుండి మాజీ సీఎం జగన్ రెడ్డికి నమ్మిన బంటుగా, నెంబర్ 2 గా ఉన్నారు విజయ సాయి రెడ్డి. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఆరోపణల నేపథ్యంలో విజయ సాయి రెడ్డి ఉన్నట్టండి తాను వైఎస్సార్సీపీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు.
అంతే కాకుండా పార్టీ పరంగా రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ఉన్నప్పటికీ పార్టీ కి పూర్తిగా దూరంగా ఉండేందుకు గాను తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పలు ఊహాగానాల మధ్య ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన తటస్తంగా ఉన్నారు. ఇప్పుడు ఈడీ నుంచి సమన్లు అందుకున్నారు. రాజకీయ పరంగా ఆయనకు పెద్ద దెబ్బగా భావించవచ్చు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటి నుంచి తన తనయుడు జగన్ మోహన్ రెడ్డి వరకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు విజయసాయి రెడ్డి.
The post మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి ఈడీ సమన్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి ఈడీ సమన్లు
Categories: