హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార నయనతార , విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ వసూళ్ల వేట కొనసాగిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది. ఏకంగా రూ. 300 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. తెలంగాణకు చెందిన బీమ్స్ సిసిరిలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఏకంగా విడుదలై నాటి నుంచి నేటి దాకా థియేటర్లలో ఫుల్ తో నిండి పోయాయి. ప్రధానంగా చాన్నాళ్ల తర్వాత జోష్ తో నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక నయనతార నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రతి వారి గుండెను తడిమేలా చేసింది.
ఆహ్లాదకరమైన సన్నివేశాలు, ఆసక్తికరమైన చిత్రీకరణ, వెరసి దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ ను మరోసారి తెరపై ప్రదర్శించారు. వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున కలెక్షన్స్ సాధిస్తూ విస్మయ పరిచేలా చేసింది. దాదాపు ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంది. అలరించేలా చేసింది. చిన్నారుల నుంచి పెద్దల దాకా మెగాస్టార్ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అక్కున చేర్చుకుంటన్నారు. తక్కువ పెట్టుబడి తో తీసిన ఈ మూవీ కాసుల పంట పండించేలా చేసింది. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో ఇంకెన్ని డబ్బులు వసూలు చేస్తుందో తెలియదని పేర్కొంటున్నారు.
The post మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సూపర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సూపర్
Categories: