hyderabadupdates.com Gallery బాలిక‌లు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాలి

బాలిక‌లు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాలి

బాలిక‌లు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాలి post thumbnail image

అమ‌రావ‌తి : గ్రామాల అభివృద్ది ఇంటి నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌చ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో మొక్క‌లు నాటారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు వంగ‌ల‌పూడి అనిత‌. పరిసరాల పరిశుభ్రత ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసి, వారితో సరదాగా ముచ్చటించారు.
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అనిత వంగ‌ల‌పూడి. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, కొంతమంది పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అనిత వంగ‌ల‌పూడి. చిన్న, చిన్న పొరపాట్లు వలన పిల్లల జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. మంచిగా చదువుకొని మహోన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. చట్టాలపై అవగాహన చేసుకోవాలని కోరారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సంధర్బంగా విద్యార్థులు క్రీడా మైదానం కావాలని కోరగా, త్వరలోనే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
The post బాలిక‌లు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలుRahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

      బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో

Madvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతంMadvi Hidma: మావోయిస్టుల మాస్టర్‌ మైండ్‌ హిడ్మా హతం

    మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది. రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ

Saudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందంSaudi Bus Tragedy: సౌదీకి ఏపీ గవర్నర్‌ నేతృత్వంలో అత్యున్నత స్థాయి బృందం

    సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యిందని భారత విదేశాంగ