hyderabadupdates.com movies ప్రభాస్ అభిమానులు షిఫ్ట్ అవ్వాలి

ప్రభాస్ అభిమానులు షిఫ్ట్ అవ్వాలి

జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు రాజా సాబ్ ప్రస్తావన పదే పదే సోషల్ మీడియాలో తెచ్చి లాభం లేదు. దర్శకుడు మారుతీని ఎంత విమర్శించినా, ఆయన అడ్రెస్సుకి ఎన్ని పార్సిళ్లు పంపించినా లాభముండదు. అవి విల్లా లోపలికి వెళ్లకుండా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కాబట్టి గేటు దగ్గర సెక్యూరిటీ వాడుకోవడం తప్ప ఎవరేం చేయలేరు.

ట్రోలింగ్ మరీ హద్దులు దాటిపోవడంతో ఎస్కెఎన్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తర్వాత ట్విట్టర్ లో కొంత వేడి చల్లారింది. సరే మూడేళ్ళ కష్టానికి ఇలాంటి సినిమా ఇచ్చారనే కోపం ఫ్యాన్స్ లో ఉండొచ్చు కానీ ఇప్పుడీ ప్రస్తావన వదిలేసి మూవాన్ అయ్యే టైం వచ్చింది.

డిజాస్టర్లు అందరికీ ఉంటాయి. ఎవరూ మినహాయింపు కాదు. మొన్న రికార్డులు బద్దలుకొట్టిన మన శంకరవరప్రసాద్ గారుకి ముందు చిరంజీవి చేసిన భోళా శంకర్ మర్చిపోయేది కాదు. సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వెంకటేష్ ట్రాక్ రికార్డు ఎలా ఉండేది.

అఖండకు మునుపు బాలకృష్ణ ఎలాంటి చేదు ఫలితాలు అందుకున్నారో తెలిసిందే. అంతెందుకు లెజెండరీ ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడు శ్రీనాథ కవిసౌర్వభామ, బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తే దారుణంగా పోయాయి. మేజర్ చంద్రకాంత్ తో తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చాటారు. ఆయన చివరి కమర్షియల్ మూవీగా దాని స్థానం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ శక్తి దగ్గర ఆగలేదు. మహేష్ బాబు నాని చూసి బాధ పడలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని గుర్తు పెట్టుకోలేదు. ఎవరికి వారు ఇవన్నీ మాములేనని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నది కూడా ఇదే. స్పిరిట్ మీదే పూర్తి ధ్యాస పెట్టారు.

ఫ్యాన్స్ అర్జెంటుగా కోరుకుంటున్నది ఏంటో గుర్తించి సందీప్ రెడ్డి వంగాకు సరెండర్ అయిపోయి కష్టపడుతున్నాడు. ఫౌజీకి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా పెద్దవి. సో రాజా సాబ్ వదిలేసి డార్లింగ్ ఫ్యాన్స్ ఇకపై వీటికి షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు రాజా సాబ్ స్పూఫ్స్, ట్రోల్స్ మీద సమయం ఖర్చు పెడితే నష్టం వాళ్ళకే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Related Post

భయం గోడలు బద్దలు కొట్టే ‘భగత్’ సింగ్భయం గోడలు బద్దలు కొట్టే ‘భగత్’ సింగ్

అభిమానులకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ కన్నా ఎక్కువ. ఓజి లాగా రికార్డులు బద్దలు కొట్టినా, హరిహర వీరమల్లు లాగా కంటెంట్ నిరాశపరిచినా వాళ్ళ ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మీద బయ్యర్లకు అంత

రెహమాన్ కన్సర్ట్ రెస్పాన్స్ తేడాగా ఉందేంటిరెహమాన్ కన్సర్ట్ రెస్పాన్స్ తేడాగా ఉందేంటి

నిన్న హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ కన్సర్ట్ గ్రాండ్ గా జరిగింది. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులతో కోలాహల వాతావరణం నెలకొంది. ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా పెద్ది టీమ్ నిలిచింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు ముగ్గురూ

న‌న్ను అరెస్టు చేయ‌రు: కేటీఆర్‌న‌న్ను అరెస్టు చేయ‌రు: కేటీఆర్‌

‘ఫార్ములా – ఈరేస్’ కేసులో త‌న‌ను అరెస్టు చేయ‌ర‌ని.. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. త‌న‌ను అరెస్టు చేసే ధైర్యం కూడా ఈ ప్ర‌భుత్వం చేయ‌ద‌ని వ్యాఖ్యానించారు. దీనికి కార‌ణాలు అనేకం ఉన్నాయ‌ని చెప్పారు. విచార‌ణ‌కు తాను స‌హ‌క‌రిస్తాన‌ని