హైదరాబాద్ : టిజీ విశ్వ ప్రసాద్, కీర్తి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ది రాజా సాబ్. దీనికి దర్శకత్వం వహించాడు మారుతి. అయితే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతి పండుగ సందర్బంగా. పాన్ ఇండియా స్థాయిలో తీసినా ఆశించినంత మేర ఆకట్టుకోలేక పోయింది. అయితే ఫెయిల్యూర్ సక్సెస్ ను పట్టించుకునే మనస్తత్వం కాదు హీరో డార్లింగ్ ప్రబాస్ ది. తనకు నచ్చితే చాలు ఎవరైనా సరే వారికి సంపూర్ణగా మద్దతు ఇస్తాడు. తను అండగా నిలబడతాడు కూడా. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త సినీ వర్గాలలో తెగ గుప్పుమంటోంది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఉన్నట్టుండి కేజీఎఫ్ మేకర్స్ తో దర్శకుడు మారుతికి తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసేలా చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
అయితే శాండిల్ వుడ్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు పొందింది హోంబలే ఫిల్మ్స్ నుండి మారుతికి ప్రభాస్ అడ్వాన్స్ ఇప్పించినట్లు సమాచారం. మారుతి ఒక స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారని, అంతా అనుకున్నట్లు జరిగితే, ప్రభాస్ స్వయంగా ఆ ప్రాజెక్ట్‌లో నటించవచ్చని చెబుతున్నారు. ఈ నివేదికలు ఇంకా ధృవీకరించ బడనప్పటికీ, ఈ వార్త ఆన్‌లైన్‌లో గణనీయమైన ప్రాచుర్యం పొందుతోంది. ఇక ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సలార్ పార్ట్ 2 కోసం హోంబలే ఫిల్మ్స్‌తో కలిసి పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా ది రాజా సాబ్ ఆశించిన మేర ఆడలేదు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు దర్శకుడు మారుతి.
The post దర్శకుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ సపోర్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
దర్శకుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ సపోర్ట్
Categories: