hyderabadupdates.com Gallery పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు

పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు

పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు post thumbnail image

న్యూఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్ల‌మెంట్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంతో తాము ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్ర‌క‌టించ‌డంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు సిద్ద‌మైంది. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఐసీసీ తీసుకున్న ఏ నిర్ణ‌యానికైనా బీసీసీఐ బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఐసీసీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా కార‌ణాల సాకుతో తాము ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించాయి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లు. అయితే త‌మ‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లంచాలంటూ స్పాన్స‌ర్ షిప్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండ‌గా పాకిస్థాన్ తమ టీ20 ప్రపంచ కప్ 2026 గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరించడంపై క్రీడాస్ఫూర్తికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న వైఖరితో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ఏకీభవిస్తుందని, ఐసీసీతో సంప్రదించిన తర్వాతే దీనిపై వ్యాఖ్యానిస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఐసీసీ క్రీడా స్పూర్తిని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. దానికి బీసీసీఐ క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. ఇండియాలో లా అండ్ ఆర్డ‌ర్ అద్భుతంఆ ఉంద‌న్నారు. అదే క్ర‌మంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల‌లో తీవ్ర‌మైన అనిశ్చితి నెల‌కొంద‌ని ఆరోపించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని రెండు దేశాల క్రికెట్ బోర్డుల‌కు సూచించారు రాజీవ్ శుక్లా.
The post పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ దందా కొన‌సాగుతోంద‌ని, ప్ర‌జా పాల‌న‌కు మంగ‌ళం పాడారంటూ మండిప‌డ్డారు. సింగ‌రేణి స్కాంలో సీఎం కీల‌క పాత్ర ఉంద‌ని,

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ

SSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదలSSC Exam Schedule: ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ షెడ్యూల్ విడుదల

  ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసింది. ఎస్ఎస్‌సీ బోర్టు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఏపీ టెన్త్ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి.