hyderabadupdates.com Gallery చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి

చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి post thumbnail image

హైద‌రాబాద్ : భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి అలియాస్ జ‌క్క‌న్న‌. రూ. 1000 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు ఇందులో కీల‌క పాత్ర పోషించిన హాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. సెన్సేష‌న్ గా మారాయి. ప్ర‌స్తుతం ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌లిసి న‌టించిన వార‌ణాసికి సంబంధించి ఇటీవ‌లే కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. వ‌చ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం వార‌ణాసి షూటింగ్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతోంది.
వార‌ణాసి చిత్రం అంటార్కిటికాలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఏకైక చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది . ఈ మూవీ రికార్డుల పుస్తకాల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతికూలమైన , కఠినమైన నిబంధనలు గల చిత్రీకరణ ప్రదేశాలలో ఒక‌టిగా ఉంది అంటార్కిటికా. వీట‌న్నింటిని త‌ట్టుకుని ప్రిన్స్ మ‌హేష్ బాబు పై కీలక సన్నివేశాలను ప్లాన్ చేసి, చిత్రీకరించి ఒక అరుదైన ప్రపంచ ఘనతను సాధించింది. ఈ ప్రాజెక్ట్ వేగంగా పురోగమిస్తోంది. తీవ్రమైన చలి, ఊహించలేని వాతావరణ పరిస్థితులు, కఠినమైన పర్యావరణ నిబంధనలను ఎదుర్కొంటోంది. స్వచ్ఛమైన తెల్లని ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో సినిమాలోని కీలక భాగాలను చిత్రీకరించినట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.
The post చరిత్ర సృష్టించిన మ‌హేష్ బాబు వార‌ణాసి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీPM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

    ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ

చెరువుల‌ను ఆక్ర‌మించాల‌ని చూస్తే తాట తీస్తాంచెరువుల‌ను ఆక్ర‌మించాల‌ని చూస్తే తాట తీస్తాం

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రు ఎంత‌టి స్థానంలో ఉన్నా చెరువుల‌ను ఆక్ర‌మించు కోవాల‌ని చూస్తే తాట తీస్తామ‌న్నారు. రామ‌చంద్రాపురం చెరువును ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం మీడియాతో

Jubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి తెరJubilee Hills By Elections: నేటితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి తెర

    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. గెలుపుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అహర్నిసలు శ్రమిస్తున్నాయి. ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా