hyderabadupdates.com Gallery ఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

ఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

ఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు post thumbnail image

తిరుప‌తి : గ‌త తొమ్మిది రోజుల పాటు నిర్వ‌హిస్తూ వ‌స్తున్న శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు సోమ‌వారం నాటితో ముగిశాయి. ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై లోకం క్షేమంగా ఉండడానికి , భక్తులు సుఖ శాంతులతో ఉండడానికి చక్రస్నానం నిర్వహించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల‌కు ధ్వ‌జావ‌రోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ముగుస్తాయి.
ఆలయంలోని పోటులో శ్రీ వంశీస్వామి, శ్రీ శేషుస్వామి ఆధ్వ‌ర్యంలో రోజుకు దాదాపు 20 వేల మంది భక్తులకు ప‌ది రకాల ప్రసాదాలు తయారుచేసి పంపిణీ చేశారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప‌ర్వ‌దినాల‌లో 25 వేల నుండి 30 వేల మందికి ప్ర‌సాదాలు అందించారు. ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల విశేషాలను మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందజేశారు. రోజుకు 100 మంది చొప్పున శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వెయ్యి మందికి, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి ఆధ్వర్యంలో 1500 మందికి వైద్యసేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
బ్రహ్మోత్సవాల్లో సరాసరి రోజుకు 7 వేల పైచిలుకు భక్తులకు టిటిడి , దాతల సహకారంతో ప్రతిరోజూ అన్నప్రసాదాలు అందించారు. గరుడసేవ రోజున విరివిగా పంపిణీ చేశారు. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులకు గాను 9 టన్నుల పుష్పాలు, 50వేలు క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌ వినియోగించారు. 60 మంది సిబ్బంది నిరంతరాయంగా సేవలందించారు. స్నపన తిరుమంజనం, వసంతోత్సవం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బెంగళూరు, చెన్నై నుంచి వివిధ రకాల పుష్పాలతో రూపొందించిన మాలలు తెప్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీనివాస మంగాపురం ఆలయ వెలుపల, లోపులతో పాటు పరిసర ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునేలా రంగురంగుల ఎల్ ఈ డి విద్యుత్ దీపాలు, భక్తి భావాన్ని పెంచేలా లైటింగ్ డిజైన్లు, భక్తులకు ఆహ్వానం పలికేలా అలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ 75 మంది పారిశుద్ధ్య కార్మికులతో ఆలయం, పోటు, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. గ‌రుడ‌సేవ, ర‌థోత్స‌వం, చ‌క్ర‌స్నానం వంటి ప్ర‌త్యేక దినాల‌లో 25 మంది అద‌న‌పు సిబ్బంది సేవ‌లందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ ధన శేఖర్, ముని శంకర్, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.
The post ఘ‌నంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్సీఎంగా రేవంత్ రెడ్డి ప‌నికిరాడు : కేటీఆర్

వికారాబాద్ జిల్లా : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో అత్యంత చెత్త ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒకే ఒక్క‌డు సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వికారాబాద్

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలిభ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : గోదావ‌రి పుష్క‌రాల‌ను క‌నీవిని ఎరుగ‌ని రీతిలో నిర్వహించాల‌ని అన్నారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. సెక్రటేరియట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్

నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్నిర్ల‌క్ష్యం వ‌ద్దు ఫైర్ సేఫ్టీలో రాజీ ప‌డొద్దు : ఏవీ రంగ‌నాథ్

హైద‌రాబాద్ : అగ్ని ప్ర‌మాదాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని హాస్ట‌ళ్ల నిర్వాహ‌కుల‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సూచించారు. వ‌స్తున్న‌ది వేస‌వి కాలం అని, ఎక్క‌డ ఏమాత్రం పొర‌పాటు జ‌రిగినా పెనుముప్పు సంభ‌విస్తుందని