hyderabadupdates.com Gallery ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి

ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి

ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ లలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని స్ప‌ష్టం చేశారు. సివిల్స్ ప‌రీక్ష‌ల‌తో పాటు గ్రూప్ –1, గ్రూఫ్–2 కోచింగ్ కోరకు మెరిట్ ఆధారంగా పారదర్శక ఎంపిక విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల ఒక హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి జిల్లాకు విస్తరించేలా దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తామని అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.
ఎస్సీ యువతలో ఆత్మ విశ్వాసం పెంచే విధంగా మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీల ప్రతినిధిత్వం పెరిగే విధంగా ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్లను అకాడమిక్ ఎక్సలెన్స్ సెంటర్స్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పారు. తమిళనాడు మోడల్‌లా అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థి నుంచి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా (పరిపాలకుడి గా ) తీర్చిద్దిదాలనే సంకల్పంతో మా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ . మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండ‌గా త‌మ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తూ అన్ని వ‌ర్గాల అభ్యున్నతి కోసం నిధుల‌ను కేటాయిస్తోంద‌ని అన్నారు.
The post ద‌ళితులు ఉన్న‌త ప‌ద‌వులు అధిరోహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలిభార‌త్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి

శ్రీ‌లంక : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే భార‌త దేశంలో భ‌ద్రతా కార‌ణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడ‌లేమంటూ పేర్కొన్నాయి. ఈ

స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతంస‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ర‌థ స‌ప్త‌మి గురించి ప్ర‌స్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మ వారి

Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !Operation Chhatru: జమ్మూకశ్మీర్‌ లో ఆపరేషన్‌ ఛత్రు ! ముగ్గురు ఉగ్రవాదులు హతం !

    జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు బుధవారం ఆపరేషన్‌ ఛత్రును చేపట్టాయి. కిష్తివాడ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. దీంతో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కిష్తివాడ్‌లోని ఛత్రు