hyderabadupdates.com Gallery టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో

టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో post thumbnail image

తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడును టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవోను, చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఇటీవ‌లే ల‌డ్డూ క‌ల్లీ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. మ‌రో వైపు కల్తీ చోటు చేసుకుందంటూ సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సైతం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. ఆపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు ను ఏర్పాటు చేశారు. ఈ మేర‌కు రంగంలోకి దిగిన సిట్ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది.
ఈ మేర‌కు త‌న‌కు అందిన నివేదిక‌ను తీసుకున్న వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ చ‌రిత్ర‌లోనే రెండు సార్లు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో)గా నియ‌మించ బ‌డ్డారు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే టీటీడీ ఆధ్వ‌ర్యంలో వైకుంఠ ఏకాద‌శి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆ వెంట‌నే నివేదిక ఆధారంగా వెంట‌నే ఆనాటి అకౌంట్స్ ఆఫీస‌ర్ బాలీజీని , ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పై బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న స్థానంలో ముద్దాడ ర‌విచంద్ర‌ను ఈవోగా నియ‌మించారు సీఎం. ఇవాళ ర‌విచంద్ర టీటీడీ చైర్మ‌న్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.
The post టీటీడీ చైర్మన్ నాయుడును కలిసిన ఈవో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

    హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్‌ మాథ్యూస్‌ ఫెర్రెరో

ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్

అమరావతి : ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు

IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్IndiGo Flight: గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

    గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్