hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం

సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం post thumbnail image

కోల్ క‌తా : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కీల‌క‌మైన విండీస్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీ ఫైన‌ల్ కు చేరింది. ఈసంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మ్యాచ్ అనంత‌రం మీడియాతో మాట్లాడాడు. త‌న జీవితంలో మ‌రిచి పోలేని మ్యాచ్ ఇది అని పేర్కొన్నాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో త‌మ అంచ‌నాల‌కు మించి ఆడాడంటూ సంజూ శాంస‌న్ గురించి పేర్కొన్నాడు. త‌ను చివ‌రి దాకా నిలవ‌డ‌మే కాదు కీల‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని, కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాడ‌ని ప్ర‌శ‌సంలు కురిపించారు సూర్య కుమార్ యాద‌వ్.
ఒక ర‌కంగా చెప్పాలంటే సంజూ శాంస‌న్ గ‌నుక మైదానంలో లేక పోయి ఉంటే భార‌త జ‌ట్టు సెమీస్ కు చేరుకుని ఉండేది కాద‌న్నాడు. క‌ళాత్మ‌క‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడ‌ని తెలిపాడు. పూర్తిగా పాత స్టైల్ క్లాసిక్ బ్యాటింగ్ తో మ‌న‌సు దోచుకున్నాడ‌ని ప్ర‌శంసించాడు సూర్య కుమార్ యాద‌వ్. ఇదే క్ర‌మంలో కామెంటేట‌ర్ బాక్స్ లో ఉన్న మాజీ క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. యాభై పూర్తి చేసిన వెంటనే విశ్రాంతి తీసుకోకు, సిక్స్ కొట్టడానికి తొందరపడి బయటకు వెళ్లకు. మళ్ళీ గార్డ్ ఫ్రెష్ గార్డ్ తీసుకొని, కొత్త లైన్లు గీయడం, మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం, మళ్ళీ అతను పిచ్ అర్థం చేసుకున్నట్లుగా రెండు బంతుల డిఫెన్స్ ఆడాడు.. అంటే అతను భారతదేశం గెలిపించే వరకు తన విధి పూర్తి కాదని అతనికి తెలుసు అని పేర్కొన్నాడు.
The post సంజు శాంస‌న్ పోరాటం వ‌ల్లే గెలుపొందాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండిఓరుగ‌ల్లు కోట భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించండి

ఢిల్లీ :కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి. కోట భూముల నుండి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని కోరారు. వాటిని తిరిగి ఏఎస్ఐకి అప్ప‌గించాల‌ని సూచించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాగా స్వాధీనం

సూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారుసూర్య చంద్రులు ఉన్నన్నాళ్లూ ఎన్టీఆర్‌ బతికే ఉంటారు

హైద‌రాబాద్ : లోకం ఉన్నంత దాకా ఎన్టీఆర్ బ‌తికే ఉంటార‌ని అన్నారు ఎమ్మెల్యే, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో

‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్‘టాక్సిక్’ రుక్మిణి వసంత్ ఫ‌స్ట్ లుక్ సూప‌ర్

బెంగ‌ళూరు : పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ కీ రోల్ పోషిస్తున్న చిత్రం టాక్సిక్. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో త‌న ఫ్యాన్స్ తో పాటు