hyderabadupdates.com Gallery విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం

విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ – 2026 నివేదిక బ‌క్వాస్ అంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రెండు నెలల రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మూడు రోజుల క్రితం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం‌కు విద్యా విధానంపై నివేదిక ఇచ్చారని అన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్ఎస్పీ. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగిందన్నారు. ఆకునూరి ముర‌ళి కావాల‌ని సీఎం చెప్పిన‌ట్టు నివేదిక త‌యారు చేశార‌ని, లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ వాపోయారు.
ఉపాధ్యాయుల జీతాలను విద్యా కమిషన్ కాదు, పీఆర్‌సీ నిర్ణయించాల్సి ఉంటుంద‌న్నారు. ఆ మాత్రం విష‌యం తెలుసుకోకుండా నివేదిక ఇవ్వ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఆర్ఎస్పీ. ఒళ్లంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్టును తయారు చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిందని మురళి ఎలా అంటారని ప్ర‌శ్నించారు. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్‌లతో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారంటూ వాపోయారు. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్టుతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర‌కు తెర లేపారంటూ ఫైర్ అయ్యారు.
The post విద్యా క‌మిష‌న్ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియ‌స్

హైద‌రాబాద్ : మిర్యాల‌గూడ వేదిక‌గా జ‌ర‌గిన బ‌హిరంగ స‌భ‌లో త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గ‌రువారం కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎక్స్

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

    బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదంMaganti Gopinath: మాగంటి గోపీనాథ్‌ వారసత్వంపై ముదిరిన వివాదం

    ఇటీవల కన్నుమూసిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ వారసత్వానికి సంబంధించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు అసలైన వారసులం తామేనని… గోపీనాథ్‌ మొదటి భార్య మాలినిదేవి, కుమారుడు తారక్‌ ప్రద్యుమ్న తెలిపారు. గతంలోనే దీనిపై రంగారెడ్డి కలెక్టర్‌కు గోపీనాథ్‌