hyderabadupdates.com Gallery ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌

ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ post thumbnail image

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. ప్ర‌స్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్ద‌రామ‌య్య మ‌రో వైపు ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ మ‌ధ్య ఆధిపత్య పోరు కొన‌సాగుతోంది. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఎవ‌రు ఉండాల‌నేది పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని ఇప్ప‌టికే ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే స్ప‌ష్టం చేశారు. సోనియా , రాహుల్ గాంధీ, తాను క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు సీఎం, డిప్యూటీ సీఎం. ఈ త‌రుణంలో ప్ర‌తిప‌క్ష నేత ఆర్. అశోక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
ఆయ‌న బాంబు పేల్చారు అధికారంలో చోటు చేసుకున్న ఆధిపత్య పోరు గురించి. ఏకంగా ఆర్. అశోక సీఎం సిద్ద‌రామ‌య్య ఫోన్ ట్యాపింగ్ కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు మండిప‌డ్డారు. ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని, ఇందులో కొత్తేముందంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి పరమేశ్వరన్.
సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించాడ‌ని, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత ఆర్.అశోక్. సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు ఆరోపించారు కేంద్రమంత్రి కుమారస్వామి. ఇదిలా ఉండ‌గా పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్‌కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి విమర్శలు చేస్తున్నారంటూ జవాబిచ్చారు సీఎం సిద్దరామయ్య. అయితే నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.
The post ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్న సీఎం సిద్ద‌రామ‌య్య‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం

ములుగు జిల్లా : ఈసారి జ‌రిగిన మేడారం జాత‌ర‌ను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు. త‌ను మంత్రి దాస‌రి సీత‌క్క‌తో క‌లిసి ప‌ర్య‌టించారు మేడారాన్ని. ఈ సందర్భంగా

తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?తెలంగాణ కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్‌..?

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కీల‌క‌మైన ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో గ‌తంలో 10 ఏళ్ల‌పాటు ఏలిన కేసీఆర్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన

నోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటానోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటా

ఢిల్లీ : ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రాజ్య‌స‌భ‌లో ఆప్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కోరుతూ స్పీక‌ర్ కు లేఖ ఇవ్వ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా సీరియ‌స్