hyderabadupdates.com Gallery వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం post thumbnail image

ముంబై : కోట్లాది మంది భార‌తీయులు ఇవాళ ముంబై వేదిక‌గా జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. వెస్టిండీస్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి భార‌త్ ను సెమీస్ చేర్చిన సంజూ శాంస‌న్ పై ఎక్కువ‌గా భార‌త్ న‌మ్మ‌కం పెట్టుకుంది. మ‌రో వైపు అభిషేక్ శ‌ర్మ‌ను ఆడిస్తారా లేదా అన్న‌ది అనుమానంగా ఉంది. ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటితేనే ఇంగ్లండ్ ను ఓడించేందుకు వీల‌వుతుంది. ఇప్ప‌టికే న్యూజిలాండ్ ద‌క్షిణాఫ్రికా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. 9 వికెట్ల తేడాతో ఓడించి టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు చేరుకుంది. ఇవాళ జ‌రిగే కీల‌క సెమీస్ లో ఎవ‌రు గెలిస్తే వారితో ఫైన‌ల్ ఆడుతుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ కు సార‌థ్యం వ‌హిస్తున్నాడు. ఆ జ‌ట్టుకు బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఉంది. 2022లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఇంగ్లండ్ ఇండియాను ఓడించింది. 2024లో అందుకు టీమిండియా ప్ర‌తీకారం తీర్చుకుంది.
ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే వివ‌రాలు ఇలా ఉన్నాయి. భారతదేశం : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు సామ్సన్, శివమ్ దుబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.
ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్
The post వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కోసం భార‌త్ స‌న్న‌ద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎంగ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : సీఎం

అమ‌రావ‌తి : దేశంలో గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్ గా ఏపీ మార బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . శ‌నివారం ఏపీలోని కాకినాడ‌లో ఏఎం గ్రీన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు

Raghuram Rajan: అమెరికా హైర్‌ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌Raghuram Rajan: అమెరికా హైర్‌ చట్టం ఆందోళనకరం – ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌

    అమెరికాలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఉపాధి తరలింపు నిలిపివేత(హెచ్‌ఐఆర్‌ఈ-హైర్‌) చట్టం… హెచ్‌-1బీ వీసా రుసుం లక్ష డాలర్లకు పెంపు కంటే ఆందోళనకరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పరిణామం మనదేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు.

PM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలుPM Narendra Modi: ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి