hyderabadupdates.com Gallery టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌

టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌

టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌ post thumbnail image

తిరుమల : ప్ర‌పంచంలోనే అత్యంత అధిక ఆదాయం క‌లిగిన ఏకైక ఆల‌యంగా వినుతికెక్కిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ఇప్ప‌టికే నియ‌మితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ ర‌విచంద్ర ఇవాళ పూర్తి స్తాయిలో ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఉదయం 7.34 గంటలకు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండ‌గా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ర‌విచంద్ర‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో ముద్దాడ ర‌విచ‌చంద్ర మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఇక నుంచి ఎవ‌రైనా స‌రే త‌మ అభిప్రాయాల‌ను, సూచ‌న‌ల‌ను నేరుగా తెలియ చేయాల‌ని సూచించారు. అంతే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో శ్ర‌మ‌కు ఓర్చి స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామ‌న్నారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌.
The post టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలిమూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

శ్రీ‌కాకుళం జిల్లా : శ్రీ‌కాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగ‌తి ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మూలాపేట పోర్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంతరం పోర్టు

ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేదు : విజ‌య్ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తి లేదు : విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడులో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ స్ప‌ష్ట‌మైన విధానంతో ముందుకు వెళుతుంద‌ని స్ప‌ష్టం చేశారు టీవీకే పార్టీ చీఫ్, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త కొంత కాలంగా టీవీకే

మ‌రాఠా మ‌హిళా క‌మిషన్ చైరప‌ర్స‌న్ రిజైన్మ‌రాఠా మ‌హిళా క‌మిషన్ చైరప‌ర్స‌న్ రిజైన్

ముంబై : రిటైర్డ్ నేవీ ఆఫీస‌ర్ అశోక్ ఖార‌త్ సెక్స్ స్కాండల్ మ‌హారాష్ట్ర స‌ర్కార్ ను కుదిపేస్తోంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రూపాలీ చ‌క‌న్క‌ర్. తీవ్ర ఆరోప‌ణ‌లు , విమ‌ర్శ‌లు రావ‌డంతో