hyderabadupdates.com Gallery అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర

అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర

అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాలు మాన‌వీయ కోణంతో ఆలోచించాల‌ని, రోగుల కు మెరుగైన సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. స‌చివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ ఆక్ట్ (THOTA) పాలసీ రూపకల్పనపై, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో అవయవ మార్పిడి చికిత్స లపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించారు. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు విధి విధానాలను సరళీకృతం చేయాలని ఆదేశించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యాచరణను రూపొందించాలన్నారు . రాష్ట్రంలో ఆర్గాన్ డొనేషన్స్ యాక్ట్ సమర్థవంతంగా అమలు అయ్యేలా అవసరమైన సమగ్ర పాలసీ రూపకల్పనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు.
ప్రైవేటు ఆసుపత్రులలో అవయవ మార్పిడి చికిత్స ల ధరల పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు సైతం అవయవ మార్పిడి చికిత్సలకు అయ్యే ఖర్చును భరించే విధంగా ధరల నియంత్రణ ఉండాలని మంత్రి సూచించారు. మంత్రి చేసిన సూచనలకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. దాతలు ఇచ్చిన అవయవాలు వృధా కాకుండా ఆస్పత్రులు ప్రత్యేక చర్యలను చేపట్టాలన్నారు. ఇతర దేశాల నుండి ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వచ్చే రోగుల కోసం నూతన విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్యశాఖ అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో చెయ్యి మార్పిడి చికిత్స కోసం 4 ఆసుపత్రులు అనుమతులు ఇచ్చామన్నారు. అలాగే, రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి ప్రవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. రాష్ట్రంలో అన్ని ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స లకు అయ్యే టారిఫ్ పై నియంత్రణ ఉండేలా కార్యాచరణ కు శ్రీకారం చుట్టామన్నారు .
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర కుమార్, జీవన్ దాన్ డైరెక్టర్ డా. భూషణ్ రాజ్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
The post అవ‌య‌వ దానాల‌ను ప్రోత్స‌హించాలి : దామోద‌ర appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌KTR: ప్రజా తీర్పును గౌరవిస్తాం – కేటీఆర్‌

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టే కనిపిస్తోందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీజేపీకు డిపాజిట్‌ కూడా రాలేదని… ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ సమీకరణం బాగానే పనిచేసిందని చెప్పారు. ఎన్నికలకు

15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్15 బిలియ‌న్ల‌ల పెట్టుబ‌డితో గూగుల్ ఏఐ హ‌బ్ రికార్డ్

న్యూఢిల్లీ : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచాయ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ వేదిక‌గా ఏర్పాటు చేసిన గూగుల్ ఏఐ హ‌బ్ చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. ఏకంగా 15 బిలియ‌న్ల‌ను పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీ

YV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణYV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ

  తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తయింది. గురువారం నాడు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు.