hyderabadupdates.com Gallery ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి

ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి post thumbnail image

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం యుద్దం జ‌రుగుతున్న క్ర‌మంలో ప్ర‌వాస భార‌తీయుల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పారు. దేశ ప్రయోజనాలను కాపాడుతూ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడి భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని స్ప‌ష్టం చేశారు.
గత 12 ఏళ్లలో భారత్ తన ఇంధన భద్రతను మరింత బలపరుచుకుందని తెలిపారు కిష‌న్ రెడ్డి. ఒకప్పుడు 27 దేశాల నుంచి మాత్రమే ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, నేడు 40 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ సరఫరాను విస్తరించిందని వెల్ల‌డించారు . వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, దేశీయంగా పెరిగిన LPG ఉత్పత్తి వంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో భయాలు, అపోహలు సృష్టిస్తూ రాజకీయ లాభం పొందాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం దురదృష్టకరం అని అన్నారు. రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలే ముందు అన్న భావన ముఖ్యం అని పేర్కొన్నారు కిష‌న్ రెడ్డి.
మోదీ ప్రభుత్వం 140 కోట్ల భారతీయుల సంక్షేమం, దేశ ఇంధన భద్రత, అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను కాపాడేందుకు నిరంతరం కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భ‌రోసా ఇచ్చారు. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే కేంద్ర స‌ర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంద‌న్నారు.
The post ప్ర‌వాస భార‌తీయుల‌కు కేంద్రం భ‌రోసా : కిష‌న్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణిRivaba Jadeja: గుజరాత్‌ మంత్రిగా టీమిండియా క్రికెటర్ జడేజా సతీమణి

Rivaba Jadeja : గుజరాత్‌ లో ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్‌ ఏర్పాటు అయింది. గుజరాత్‌లోని గాంధీ నగర్‌ లో నేడు 26 మంది సభ్యుల కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారిలో

సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యంసర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభ‌యం

తిరుపతి : తిరుపతిలోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆల‌యం. ప్ర‌తి ఏటా బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతుండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నాలుగో

హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలిహిందూ కుటుంబాలు ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాలి

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ముస్లింల‌ను దృష్టిలో ఉంచుకుని మాట్లాడిన మాట‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనాల‌ని పిలుపునిచ్చారు. రోజు రోజుకు భార‌త