hyderabadupdates.com Gallery పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం

పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం

పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు రూపోందించిన ప్రచార వీడియోలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత అనేది లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్త జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే దేవాలయాల వద్ద అవసరమైన మేరకు పోలీసు సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని పేర్కొన్నారు సీఎం. రాష్ట్రంలో నేరాల రేటు 6 శాతం మేర తగ్గిందన్నారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. అయితే ఇదే క్ర‌మంలో ఆర్ధిక నేరాలు, సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరిగాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
వీటిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని డీజీపిని ఆదేశించారు సీఎం. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. రోడ్ సేఫ్టీ చర్యలు మరింతగా చేపట్టాలన్నారు. అవసరమైన చోట ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. 503 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు సరి చేయాల‌ని సూచించారు. మహిళలపై నేరాలు తగ్గాయని, మరింతగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చ‌రించారు. రౌడీషీటర్లను కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని పరిశీలించాలని అన్నారు .గత పాలనలో గంజాయి, అక్రమ మద్యం లాంటివి విచ్చలవిడిగా ఉండేవన్నారు. వదంతులు సృష్టించటం, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననం లాంటివి గతంలో ఉన్నాయన్నారు. నెల్లూరులో రౌడీ ముఠాలను గుర్తించారని, ఇలాంటి ముఠాలు మిగిలిన జిల్లాల్లో ఉన్నాయేమో నిఘా పెట్టాల‌న్నారు.
The post పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు

అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత‌, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. అన్న ఎన్టీఆర్

రోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వంరోయా నువ్వే నా సంగీతం నా స‌ర్వ‌స్వం

పాకిస్తాన్ :ప్ర‌ముఖ పాకిస్తాన్ సింగ‌ర్ అద్నాన్ స‌మీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సంద‌ర్బంగా ఎక్స్ వేదిక‌గా గురువారం స్పందించాడు. పదహారు సంవత్సరాల క్రితం నా ప్రియమైన రోయా నాకు ‘అవును’ అని చెప్పింది. ఆ క్షణం నుండే నా జీవితం