hyderabadupdates.com Gallery వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి

వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి

వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో కొలువు తీరిన‌ శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాల మధ్య ప్రార్థనా మందిరానికి చేరుకుని, వేద పండితులు, విద్యార్థులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత వేద పండితులు ఆయనకు పుష్పమాల, ఫలాలు, శాలువాతో సత్కారం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల గురించి టిటిడి ఛైర్మెన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వేద పండితులు, విద్యార్థులు ,సిబ్బందికి సమస్యలు ఉన్నాయా అని కూడా తెలుసుకున్నారు. పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలపై విద్యార్థులు , అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వేద పాఠశాల ప్రిన్సిపాల్ గూడ శ్రీనివాస శర్మ అవధాని మాట్లాడుతూ, ఈ పాఠశాల 1981 సంవత్సరంలో స్థాపించ బడిందని, ప్రస్తుతం 132 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారని టిటిడి ఛైర్మెన్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఇంజనీరింగ్ అధికారులు డీఈ రామకృష్ణ, జేఈ చలమా నాయక్ ,విద్యార్థులు పాల్గొన్నారు.
The post వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్CM Mamata Banerjee: వైద్య విద్యార్థిని అత్యాచారంపై సీఎం మమత షాకింగ్ కామెంట్స్

    పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో శుక్రవారం(అక్టోబర్‌ 10వ తేదీ) వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరగడంపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తనను షాక్‌కు గురి చేసిందని, బాధితురాలికి కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లుశ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లు

తిరుమల : తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో జరిగే

Kerala Government Honours Mohanlal for Dadasaheb Phalke AwardKerala Government Honours Mohanlal for Dadasaheb Phalke Award

Veteran actor Mohanlal was felicitated by the Kerala government in a grand ceremony held at the Central Stadium in Thiruvananthapuram, following his recent recognition with the prestigious Dadasaheb Phalke Award.